సింక్‌‌‌‌ఫీల్డ్‌‌‌‌ కప్‌‌‌‌ టోర్నీలో ప్రజ్ఞానందకు తొలి ఓటమి

సింక్‌‌‌‌ఫీల్డ్‌‌‌‌ కప్‌‌‌‌ టోర్నీలో ప్రజ్ఞానందకు తొలి ఓటమి

సెంట్‌‌‌‌ లూయిస్‌‌‌‌ (అమెరికా): ఇండియా గ్రాండ్‌‌‌‌ మాస్టర్‌‌‌‌ ఆర్‌‌‌‌. ప్రజ్ఞానంద.. సింక్‌‌‌‌ఫీల్డ్‌‌‌‌ కప్‌‌‌‌ టోర్నీలో తొలి ఓటమిని ఎదుర్కొన్నాడు. జర్మనీ గ్రాండ్‌‌‌‌ మాస్టర్‌‌‌‌ విన్సెంట్‌‌‌‌ కీమర్‌‌‌‌తో గురువారం జరిగిన మూడో రౌండ్‌‌‌‌ గేమ్‌‌‌‌లో ప్రజ్ఞానంద 51 ఎత్తుల వద్ద ఓటమిని చవిచూశాడు. దాంతో ఒకటిన్నర పాయింట్‌‌‌‌తో సంయుక్తంగా ఆరో ప్లేస్‌‌‌‌లో కొనసాగుతున్నాడు. 

మరో గేమ్‌‌‌‌లో వెస్లీ సో (అమెరికా).. ఫ్యాబియానో కరువాన (అమెరికా)పై గెలిచి 2.5 పాయింట్లతో టాప్‌‌‌‌లో కొనసాగుతున్నాడు. ఇతర గేమ్‌‌‌‌ల్లో జావోఖిర్‌‌‌‌ సిందరోవ్‌‌‌‌ (ఉజ్బెకిస్తాన్‌‌‌‌, 1).. మాక్సిమ్‌‌‌‌ వాచియర్‌‌‌‌ లాగ్రెవ్‌‌‌‌ (ఫ్రాన్స్‌‌‌‌, 2), జోర్డెన్‌‌‌‌ వాన్‌‌‌‌ ఫోరెస్ట్‌‌‌‌ (నెదర్లాండ్స్‌‌‌‌, 0.5), లెవోన్‌‌‌‌ అరోనియన్‌‌‌‌ (అమెరికా, 2) మధ్య జరిగిన గేమ్‌‌‌‌లు డ్రా అయ్యింది. సావియన్‌‌‌‌ శామ్యూల్స్‌‌‌‌ (అమెరికా, 1.5).. అనిష్‌‌‌‌ గిరి (నెదర్లాండ్స్‌‌‌‌, 1)పై గెలిచాడు.