కరీంనగర్ లోని మెడికవర్లో ప్రతి నెలా ఫ్రీ క్యాన్సర్ క్యాంప్

కరీంనగర్ లోని మెడికవర్లో ప్రతి నెలా  ఫ్రీ క్యాన్సర్ క్యాంప్

కరీంనగర్ టౌన్, వెలుగు: కరీంనగర్​లోని మెడికవర్ హాస్పిటల్​లో ప్రతి నెలా రెండో గురువారం ఉచిత క్యాన్సర్ శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు మెడికవర్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అంకాలజీ డాక్టర్లు అన్వేష్, నీలేశ్, స్నేహ తెలిపారు. బుధవారం హాస్పిటల్​లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో డాక్టర్లతో కలిసి సెంటర్ హెడ్ గుర్రం కిరణ్ ​పాల్గొని మాట్లాడారు. 

మొదటి  ఉచిత క్యాన్సర్ శిబిరంలో 186 మందికి పరీక్షలు చేయగా అందులో 26 మందికి పాజిటివ్​గా  నిర్ధారణ అయినట్లు వెల్లడించారు. -బ్రెస్ట్ క్యాన్సర్ కేసులు అధికంగా నమోదవుతున్నాయన్నారు. హాస్పిటల్​కల్పించిన ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకొని ముందస్తు పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. సంప‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, మార్కెటింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మేనేజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కర్ణాకర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, పీఆర్ అబ్దుల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వ‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కీల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పాల్గొన్నారు.