పెద్దపల్లి, వెలుగు: కాంగ్రెస్ సర్కార్తోనే అభివృద్ధి సాధ్యమవుతుందని, ఎన్నికల ముందు చెప్పినట్లుగానే చేసి చూపిస్తున్నామని పెద్దపల్లి ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ విజయ రమణారావు అన్నారు. కాల్వ శ్రీరాంపూర్మండలం జాఫర్ఖాన్పేటలో గురువారం పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసి, రూ. 5.43 కోట్లతో పూర్తయిన మద్దెల వాగు బ్రిడ్జిని ఎమ్మెల్యే ప్రారంభించారు.
గ్రామీణ ప్రజల కోసం కొత్త ఆర్టీసీ బస్సు సర్వీసులను జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గ్రామంలోని వీధులన్నింటికీ సీసీ రోడ్లు పూర్తి చేశామన్నారు. రూ. 5.43 కోట్లతో మద్దెల వాగు బ్రిడ్జి పూర్తి చేయడమే కాకుండా, అప్రోచ్ రోడ్లకు అదనంగా మరో రూ.కోటి ఖర్చు చేసి రవాణా కష్టాలను తీర్చామని తెలిపారు. చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. అధికారులు, కాంగ్రెస్ లీడర్లు పాల్గొన్నారు.
