హైదరాబాద్, వెలుగు: ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ అగ్రిసెట్, అగ్రి ఇంజనీరింగ్ సెట్ -2026 కు అప్లై చేసుకునేందుకు గడువు పొడిగించినట్లు వీసీ ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య తెలిపారు. ఆసక్తి, అర్హతలు గల అభ్యర్థులు ఆగస్టు 31 వరకూ ఆన్ లైన్లో అప్లయ్ చేసుకోవచ్చని తెలిపారు.
అగ్రికల్చర్ డిప్లొమా, అగ్రికల్చర్ ఇంజినీరింగ్ డిప్లొమా కోర్సులు పూర్తి చేసుకుని బీఎస్సీ(ఆనర్స్) అగ్రికల్చర్, బీటెక్ (అగ్రికల్చరల్ ఇంజినీరింగ్ ) కోర్సుల్లో ప్రవేశం పొందాలని కోరుకునే వారు ఈ అగ్రిసెట్, అగ్రి ఇంజనీరింగ్ సెట్ -2026 పరీక్ష రాయాల్సి ఉంటుందని వీసీ వివరించారు. పూర్తి వివరాలకు వర్సిటీ వెబ్ సైట్ https://pjtau.edu.in ను సందర్శించాలని సూచించారు.
