ఈ స్పోర్ట్స్‌‌ వరల్డ్‌‌ కప్‌‌ చెస్‌‌ టోర్నీలో క్వార్టర్స్‌‌కు చేరిన అర్జున్‌‌

ఈ స్పోర్ట్స్‌‌ వరల్డ్‌‌ కప్‌‌ చెస్‌‌ టోర్నీలో క్వార్టర్స్‌‌కు చేరిన అర్జున్‌‌

పారిస్: తెలంగాణ గ్రాండ్‌‌ మాస్టర్‌‌ అర్జున్‌‌ ఎరిగైసి.. ఈ స్పోర్ట్స్‌‌ వరల్డ్‌‌ కప్‌‌ (ఈడబ్ల్యూసీ) చెస్‌‌ టోర్నీలో క్వార్టర్‌‌ఫైనల్లోకి ప్రవేశించాడు. గురువారం జరిగిన లోయర్‌‌ బ్రాకెట్‌‌ డిసైడర్‌‌లో అర్జున్‌‌ 2–0తో ప్రాణేశ్‌‌పై గెలిచాడు. దాంతో గ్రూప్‌‌–ఎలో రెండో ప్లేస్‌‌లో నిలిచాడు. మరో లోయర్‌‌ బ్రాకెట్‌‌ పోరులో నిహాల్‌‌ సరీన్‌‌.. వీ యి, జాన్‌‌ క్రిస్టోఫ్‌‌ డుడాపై నెగ్గాడు. ఇప్పటికే మాగ్నస్‌‌ కార్ల్‌‌సన్‌‌, అలీరెజా ఫిరౌజా, నకముర, నొడిర్బెక్‌‌ అబ్దుసత్తారోవ్‌‌ ప్లే ఆఫ్స్‌‌ చేరారు.