బెంగళూర్ హైవేపై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా.. బస్సులో 37 మంది విద్యార్థులు

బెంగళూర్ హైవేపై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా.. బస్సులో 37 మంది విద్యార్థులు

బెంగళూర్ హైవేపై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు బోల్తా కొట్టింది. 2026 సెప్టెంబర్ 28న ఉదయం బస్సు అదుపు తప్పి హైవే పై నుంచి పల్టీ కొడుతూ రోడ్డు పక్కన బోల్తా పడింది. జోగులాంబ గద్వాల జిల్లాలోని మానవపాడు మండలం బోరవెల్లి దగ్గర జాతీయ రహదారి పై ఈ ప్రమాదం జరిగింది.  

బస్సు ప్రమాదానికి గురైనప్పుడు బస్సులో 37మంది విద్యార్థులు ఉన్నారు. విద్యార్థులు, టీచర్లు స్వల్ప గాయాలతో బయట పడటంతో పెద్ద ప్రమాదం తప్పిందని ఊపిరి పీల్చుకున్నారు. 

తమిళనాడు రాష్ట్రం సేలం కు చెందిన ప్రైవేటు పాఠశాల విద్యార్థులు విహారయాత్ర నిమిత్తం హైదరాబాద్ వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. హైదరాబాద్ లోని వండర్ లా టూర్ కు వచ్చిన విద్యార్థుల బస్సు ప్రమాదానికి గురికావడం తీవ్రం ఆదోళనకు గురిచేసింది.