సుల్తానాబాద్, వెలుగు: పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గర్రెపల్లి గ్రామానికి చెందిన ప్రాచీన కడ్డీతంత్రి వాయిద్యం, జడ కొప్పులాట కళాకారుడు దుర్శెట్టి రామయ్య గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా ఢిల్లీలో అవార్డు అందుకున్నారు.
ఆయా కళా రంగాల్లో చేస్తున్న విశేష కృషికి జాతీయ సంగీత నాటక అకాడమీ 2024 సంవత్సరానికి గాను అవార్డు ప్రకటించగా తాజాగా రాష్ట్రపతి ఆ అవార్డును అందజేశారు. తెలంగాణ జానపద సంగీతానికి అందించిన విశిష్ట సేవలకు గాను గతంలో ఆయన అనేక అవార్డులు సొంతం చేసుకున్నారు.
