ఇయ్యాల (ఆగస్టు 14) కేబినెట్ భేటీ... సీఎం రేవంత్ విదేశీ పర్యటన, పెట్టుబడిదారులతో సమావేశంపై చర్చ

ఇయ్యాల (ఆగస్టు 14) కేబినెట్ భేటీ... సీఎం రేవంత్ విదేశీ పర్యటన, పెట్టుబడిదారులతో సమావేశంపై చర్చ
  •     మెట్రో స్వాధీనం, విస్తరణ, ఎల్‌‌‌‌‌‌‌‌‌‌ఐజీ స్కీమ్‌‌‌‌, ఎల్‌‌‌‌నినోపై డిస్కషన్‌‌‌‌

హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన శుక్రవారం ఉదయం 10.30 గంటలకు సెక్రటేరియెట్‌‌‌‌లో కేబినెట్ సమా వేశం జరగనుంది. ఈ భేటీలో సీఎం రేవంత్​ రెడ్డి చేపట్టనున్న విదేశీ పర్యటన, వివిధ యూనివర్సిటీల సందర్శనలు, పెట్టుబడిదారులతో సమావేశాల వివరాలతో పాటు హైదరాబాద్ మెట్రో రైలు స్వాధీనం, రెండో విడత విస్తరణపై చర్చించి, నిర్ణయాలు తీసుకోనున్నారు. గృహ నిర్మాణంలో ఎల్‌‌‌‌ఐజీ స్కీమ్‌‌‌‌ అమలు, సన్నవడ్లకు బోనస్‌‌‌‌, భూ కేటాయింపులతో పాటు ఎల్‌‌‌‌నినో ప్రభావం, రాష్ట్రంలో సాగైన పంటలు, ప్రత్యామ్నాయ పంటల సాగు విధానంపై సుదీర్ఘంగా చర్చించనున్నారు. 

స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ, కొత్త చేయూత పెన్షన్ల అమలు, గిగ్ వర్కర్ల చట్టం మార్గదర్శకాలు, 22ఏ నిషేధిత భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రతిపాదనలను సైతం సిద్ధం చేశారు. వీటితో పాటు మున్సిపల్ పరిపాలన పనులు, ప్రతిష్టాత్మక ‘గాంధీ సరోవర్’ప్రాజెక్టు నిర్మాణ పురోగతిపై నిర్ణయాలు తీసుకోనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పథకాలు, ఆరు గ్యారంటీల లబ్ధిని రాష్ట్రంలోని మరింత మంది అర్హులకు కల్పించేందుకు వీలుగా కేబినెట్‌‌‌‌లో రోడ్‌‌‌‌మ్యాప్ సిద్ధం చేయనున్నారు.