కామారెడ్డి జిల్లాలో పిచ్చి కుక్కలు రెచ్చిపోయాయి. రోడ్లపై నడుచుకుంటూ వెళ్తున్న వారిపై దాడి చేశాయి. ముఖం, కాళ్లు, చేతులు, తొడలు ఇలా శరీరమంతా గాయాలు చేశాయి. పిచ్చికుక్కల దాడిలో ఆరుగురికి తీవ్రగాయాలు కాగా వారిని చికిత్స కోసం కామారెడ్డి జిల్లాస్పత్రికి తరలించారు. బాధితులు ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. వివరాల్లోకి వెళితే..
కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండంల పోసానిపేటలో బుధవారం ( మార్చి18) పిచ్చికుక్కలు రెచ్చిపోయి గ్రామస్తులపై దాడులు చేశారు. దారెంట నడుచుకుంటూ వెళ్తున్న వారిపై వెంటపడి మరీ దాడి చేశాయి. పిచ్చికుక్కల గుంపు దాడిలో ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. కుక్కల గుంపు దాడిలో పలువురికి ముఖం, కాళ్లు, చేతులు, తొడ, మెడ భాగాల్లో గాయాలయ్యాయి. బాధితుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. గాయపడిన వారిని చికిత్సకోసం కామారెడ్డి జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారు గ్రామస్తులు.
►ALSO READ | హైదరాబాద్లో అక్కను చంపి ముక్కలు చేసిన తమ్ముడు
పిచ్చికుక్కలను అరికట్టాలని ఎన్నిసార్లు గ్రామపంచాయతీ అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటూ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా స్పందించి కుక్కలను నివారణకు చర్యలు చేపట్టాలని కోరారు.
