హైదరాబాద్‎లో అక్కను చంపి ముక్కలు చేసిన తమ్ముడు

హైదరాబాద్‎లో అక్కను చంపి ముక్కలు చేసిన తమ్ముడు

2025లో రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికి గురి చేసిన మీర్ పేట్ హత్య కేసు గుర్తు ఉంది కదా.. ఆర్మీలో పని చేసి రిటైర్డ్ అయిన మాజీ జవాన్ భార్యను ముక్కలు ముక్కలుగా నరికి చంపాడు. అనంతరం భార్య డెడ్ బాడీని చిన్న చిన్న ముక్కలు చేసి కరెంట్ హీటర్‎తో శరీర భాగాలను ఉడకబెట్టి ముద్దగా దంచి సమీపంలోని చెరువులో పడేశాడు. 

లేటేస్ట్‎గా హైదరాబాద్ శివారులోని అబ్దుల్లాపూర్‌మెట్‌ బాటాసింగారంలో ఇలాంటి ఘటనే వెలుగులోకి వచ్చింది. అక్క ప్రవర్తన సరిగ్గా లేదని తీవ్ర ఆగ్రహానికి గురైన తమ్ముడు అక్కని దారుణంగా చంపేశాడు. అనంతరం డెడ్ బాడీని ముక్కలు చేసి చెరువులో పడేశాడు. 

వివరాల ప్రకారం.. చెడు తిరుగుళ్లు తిరుగుతుందని అక్కని చంపి ముక్కలు చేసి చెరువులో పడేశాడు తమ్ముడు. ఈ దారుణ ఘటన అబ్దుల్లాపూర్‌మెట్‌ బాటాసింగారంలో చోటు చేసుకుంది. బావ చనిపోయిన తర్వాత అక్క ప్రవర్తనలో మార్పు వచ్చిందని  తమ్ముడు తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. ఎన్నిసార్లు చెప్పిన ప్రవర్తన మార్చుకోకపోవడంతో అక్కను కిరాతకంగా హత్య చేశాడు. 

అనంతరం అక్క డెడ్ బాడీని రంపంతో కోసి రెండు భాగాలుగా చేసి మజీత్ పూర్ అక్కచెల్లెలు చెరువులో పడేశాడు. తర్వాత ఏమి తెలియనట్లుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి కిరాణా షాపుకు వెళ్లిన మా అక్క తిరిగి ఇంటికి రాలేదని మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చాడు. పప్పు రామ్ ఫిర్యాదు మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కేసు దర్యాప్తులో తమ్ముడే అక్కను చంపినట్లు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు పప్పు రామ్‎పై కేసు నమోదు చేశారు. 

►ALSO READ | హైదరాబాద్లో దారుణం.. చాక్లెట్ ఇప్పిస్తానని చెప్పి తీసుకెళ్లి ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం, హత్య