స్టేషన్ ఘనపూర్: ‘దోస్త్’ స్పెషల్ డ్రైవ్ అడ్మిషన్లు షురూ

స్టేషన్ ఘనపూర్: ‘దోస్త్’ స్పెషల్ డ్రైవ్ అడ్మిషన్లు షురూ

స్టేషన్ ఘనపూర్, వెలుగు: 2026–27 విద్యా సంవత్సరానికి డిగ్రీ ప్రవేశాల కోసం నిర్వహించే ‘దోస్త్’ స్పెషల్ డ్రైవ్ ఫేజ్ అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైనట్లు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఇన్​చార్జి ప్రిన్సిపాల్  బి.చంద్రమౌళి తెలిపారు. స్పెషల్ డ్రైవ్ రిజిస్ట్రేషన్లు ఆగస్టు 6 నుంచి 11 వరకు, వెబ్ ఆప్షన్ల నమోదు ఆగస్టు 6 నుంచి 12 వరకు, సీట్ల కేటాయింపు ఆగస్టు 14న, ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ ఆగస్టు 14 నుంచి 18 వరకు ఉంటుందని తెలిపారు. 

ఆన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసిన విద్యార్థులు తప్పనిసరిగా కళాశాలలో నేరుగా రిపోర్ట్ చేయాలని సూచించారు. స్టేషన్ ఘనపూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో దోస్త్ ద్వారా బీఏ, బీకాం, బీఎస్సీ లైఫ్ సైన్స్, బీఎస్సీ ఫిజికల్ సైన్స్ కోర్సులు అందుబాటులో ఉన్నాయని, అన్ని కోర్సుల్లో కంప్యూటర్ సైన్స్ సబ్జెక్టు కూడా ఉందని తెలిపారు. విద్యార్థులు దోస్త్ వెబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకుని ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.