ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా టెక్కలి దగ్గర ఘోర రైలు ప్రమాదం జరిగింది. పట్టాలపై నడుస్తున్న వారిని రాజారాణి ఎక్స్ప్రెస్ రైలు ఢీకొట్టింది. ఈ ఘటనలో అక్కడికక్కడే నలుగురు మరణించారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు.
సమాచారం అందుకున్న పోలీసులు, రైల్వే అధికారులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహయక చర్యలు చేపట్టారు. గాయపడ్డవారిని చికిత్స నిమిత్తం దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.
మృతులు రైలును గమనించకపోవడమే ఈ ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఘటన స్థలంలో సహయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ ప్రమాదంతో రైళ్ల రాకపోకలకు కాస్తా అంతరాయం ఏర్పడింది. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
