వెంకటాపూర్ (రామప్ప), వెలుగు: రామప్ప ఆలయ శిల్పకళ అద్భుతమని సినీ నటుడు తనికెళ్ల భరణి అన్నారు. మంగళవారం ఆయన రామప్ప టెంపుల్ ను సందర్శించారు. ఆలయ అర్చకులు ఆయనకు స్వాగతం పలికి, ప్రత్యేక పూజల అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేసి, స్వామి వారి శేషావస్ర్తాలను బహూకరించారు. టూరిజం గైడ్ విజయ్ ఆలయ చరిత్ర, శిల్పకళ వైభవం, కాకతీయుల చరిత్ర గురించి వివరించారు. అనంతరం భరణి రామప్ప లేక్ ను సందర్శించి, బోటింగ్ చేశారు.
