హైదరాబాద్లో దారుణం.. చాక్లెట్ ఇప్పిస్తానని చెప్పి తీసుకెళ్లి ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం, హత్య

హైదరాబాద్లో దారుణం.. చాక్లెట్ ఇప్పిస్తానని చెప్పి తీసుకెళ్లి ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం, హత్య

అభం శుభం తెలియని చిన్నారులపై అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. పోలీసులు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కామాంధులు చిన్నారులను బలితీసుకుంటూనే ఉన్నారు. లేటెస్టుగా హైదరాబాద్ లో ఆరేళ్ల చిన్నారిని అత్యాచారం చేసి, హత్య చేసిన ఘటన కలకలం రేపింది. చాక్లెట్ ఆశ చూపించి చిన్నారిపై ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు నిందితుడు.

నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన సోమవారం (మార్చి 16)  వెలుగులోకి వచ్చింది.  చాక్లెట్ ఇప్పిస్తానంటూ నమ్మించి బాలికపై రేప్ చేసి ఆపై హత్య చేశాడు కామాంధుడు. బాలిక ఆదివారం సాయంత్రం నుండి కనిపించక పోవడంతో రాత్రి 10 గంటలకు నార్సింగి పోలీస్ స్టేషన్ లో తల్లి తండ్రులు  ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

►ALSO READ | తనతోపాటే పుట్టిన చెల్లి అని కూడా చూడలేదు.. 84 సార్లు పొడిచి చంపిన అన్న

బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన నార్సింగి పోలీసులు స్థానికంగా ఉన్న సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించారు. బాలికను కామాంధుడు తీసుకెళ్తున్న దృశ్యాలను సీసీటీవీ ఫుటేజ్ లో గుర్తించారు.  వెంటనే సర్చ్ ఆపరేషన్ పెట్టి హంతకుడిని పట్టుకున్నారు పోలీసులు. బాలిక ఎక్కడుందో చెప్పమని అడగటంతో రాత్రి ఒంటి గంటకు బాలిక మృతదేహాన్ని చూపించినట్లు పోలీసులు తెలిపారు. హంతకుడిపై రేపే అండ్ మర్డర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.