నల్గొండ: అవయవ దాతల కుటుంబాలు సమాజానికి ఆదర్శం : కలెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చంద్రశేఖర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

నల్గొండ,వెలుగు: పుట్టెడు దుఃఖంలోనూ మానవత్వాన్ని చాటుకుని, మరణానంతరం పలువురి జీవితాల్లో వెలుగులు నింపిన అవయవదాతల కుటుంబాలు సమాజానికి ఆదర్శంగా నిలిచాయని నల్గొండ కలెక్టర్ బి.చంద్రశేఖర్ కొనియాడారు. సోమవారం జాతీయ అవయవదాన దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో లయన్స్ క్లబ్ ఆఫ్ నల్గొండ చారిటబుల్ ట్రస్ట్, లయన్స్ క్లబ్ నల్గొండ ఆధ్వర్యంలో 9 అవయవ దాతల కుటుంబాలను సత్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అవయవదాన ప్రతిజ్ఞ పత్రంపై సంతకం చేసి తన సంపూర్ణ మద్దతు తెలిపారు. కలెక్టర్ మాట్లాడుతూ విషాద సమయంలోనూ తమ ప్రియమైన వారి అవయవాలను దానం చేయడానికి ముందుకు రావడం ఆ కుటుంబాల మహోన్నత వ్యక్తిత్వానికి నిదర్శనమన్నారు. 

అవయవదాతల కుటుంబాల్లోని అర్హులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు వెంటనే అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. భవిష్యత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో లయన్స్ క్లబ్ చేపట్టే నేత్రదాన, అవయవదాన అవగాహన కార్యక్రమాలకు జిల్లా యంత్రాంగం నుంచి పూర్తి సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ 320ఇ జిల్లా గవర్నర్ కేవీ ప్రసాద్, క్లబ్ అధ్యక్షుడు అశోక్, జిల్లా కార్యవర్గ సభ్యుడు ఎల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌వీ కుమార్, ఐ డొనేషన్ సెంటర్ ఎండీ హరనాథ్ కడిమి, కో-ఆర్డినేటర్లు చంద్రశేఖర్, సరిత, తదితరులు పాల్గొన్నారు.