ధోని కాదు బాస్.. భారత క్రికెట్‌లో అసలు మాస్టర్‌మైండ్ అతడిదే!

ధోని కాదు బాస్.. భారత క్రికెట్‌లో అసలు మాస్టర్‌మైండ్ అతడిదే!

ప్రపంచ క్రికెట్‌లో ఎంఎస్ ధోనీకి ఉన్న క్రికెటింగ్ మైండ్ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తీవ్ర ఒత్తిడిలోనూ మైండ్ గేమ్‌తో మ్యాచ్ స్వరూపాన్నే మార్చేసే ధోనీకి వ్యూహాలు రచించడంలో సాటిరారెవరూ లేరు. చెన్నై సూపర్ కింగ్స్ (CSK) డ్రెస్సింగ్ రూమ్‌ను ధోనీతో షేర్ చేసుకున్న ఇంగ్లాండ్ మాజీ ఆల్‌రౌండర్ మొయిన్ అలీ, అతడి నాయకత్వ  గొప్పతనాన్ని ఎన్నోసార్లు దగ్గరుండి చూశాడు. కానీ, ధోనీ వంటి దిగ్గజ కెప్టెన్‌తో సహా ఎందరో మహామహుల మార్గదర్శకత్వంలో ఆడిన మొయిన్ అలీ, తన సుదీర్ఘ కెరీర్‌లో చూసిన అత్యుత్తమ క్రికెటింగ్ బ్రెయిన్ (Best Cricketing Brain) ధోనీ కాదని, భారత మాజీ పేసర్, గుజరాత్ టైటాన్స్ హెడ్ కోచ్ ఆశిష్ నెహ్రా అంటూ బాంబు పేల్చాడు. 

ఓ పోడ్‌కాస్ట్‌లో మొయిన్ అలీ హాట్ కామెంట్స్: 

2018, 2019 ఐపీఎల్ సీజన్లలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టులో నెహ్రా బౌలింగ్ కోచ్‌గా ఉన్నప్పుడు ఆయనతో కలిసి పని చేసిన మొయిన్ అలీ, బియర్డ్ బిఫోర్ వికెట్ (Beard Before Wicket) పోడ్‌కాస్ట్‌లో నెహ్రా క్రికెట్ అవగాహనను కొనియాడాడు. నా దృష్టిలో ప్రతి పరిస్థితి గురించి పూర్తి అవగాహన ఉన్నవాడే నిజమైన క్రికెటింగ్ బ్రెయిన్. మైదానంలో ఎలాంటి పరిస్థితి తలెత్తినా ఆయన దగ్గర ఒక స్పష్టమైన ఆన్సర్ సిద్ధంగా ఉంటుంది. ఒక ఆటగాడు ఎందుకు రాణించడం లేదు, ఆ పరిస్థితిలో ఏం జరగాలి అనే అంశాలపై నెహ్రా మాట్లాడే తీరు అద్భుతంగా ఉంటుదన్నాడు. 

అంచనాలు కాదు.. డేటాతో కూడిన మైండ్!

* డేటా & అనుభవం: ఆశిష్ నెహ్రా చెప్పే ప్రతీ మాట వెనుక కేవలం ఊహాగానాలు మాత్రమే కాకుండా డేటా, అనుభవం, స్పష్టమైన ఆధారాలు ఉంటాయని మొయిన్ అలీ తెలిపాడు.

* మ్యాన్ మేనేజ్‌మెంట్ స్కిల్స్: ఆటగాళ్లు, కోచ్‌లు, జట్టు సభ్యులతో ఎలా మెసలుకోవాలి, డ్రెస్సింగ్ రూమ్‌లో సరైన వాతావరణాన్ని ఎలా సృష్టించాలో నెహ్రాకు బాగా తెలుసని పేర్కొన్నాడు.

* అద్భుతమైన పరిజ్ఞానం: మైదానంలో ఏ పరిస్థితి ఎదురైనా నెహ్రాకు స్పష్టమైన అవగాహన ఉంటుందని, అతను మాట్లాడే ప్రతీ మాటలోనూ అద్భుతమైన క్రికెట్ పరిజ్ఞానం కనిపిస్తుందని మొయిన్ అలీ ప్రశంసించాడు.

ఐపీఎల్‌లో కోచ్‌గా ఆశిష్ నెహ్రా రికార్డులు: 

ఆటగాడిగా రిటైర్ అయిన తర్వాత నెహ్రా కోచింగ్ రంగంలో బాగా రాణిస్తున్నాడు. 2022లో ఐపీఎల్‌లోకి అరంగేట్రం చేసిన గుజరాత్ టైటాన్స్‌కు హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన నెహ్రా, తన తొలి సీజన్లోనే జట్టును ఛాంపియన్‌గా నిలబెట్టిన మొదటి భారతీయ హెడ్ కోచ్‌గా చరిత్ర సృష్టించాడు. ముందస్తు అంచనాలు లేనప్పటికీ, గత 5 సీజన్లలో కేవలం ఒక్కసారి మాత్రమే ప్లేఆఫ్స్ మిస్ అయిన గుజరాత్ టైటాన్స్, ఐపీఎల్‌లో అత్యంత నిలకడైన జట్లలో ఒకటిగా కొనసాగుతోంది.

►ALSO READ | భారత జట్టుకి కొత్త ఫీల్డింగ్ కోచ్.. ఇంతకీ ఎవరీ శుభదీప్ ఘోష్?