పొగుళ్లపల్లి ఏకలవ్య గురుకులంలో స్టూడెంట్స్ ఘర్షణ.. 11 మంది సస్పెన్షన్‌‌

 పొగుళ్లపల్లి ఏకలవ్య గురుకులంలో స్టూడెంట్స్ ఘర్షణ.. 11 మంది సస్పెన్షన్‌‌

కొత్తగూడ, వెలుగు: మహబూబాబాద్‌‌ జిల్లా కొత్తగూడ మండలం పొగుళ్లపల్లిలోని ఏకలవ్య గురుకులంలో ఇంటర్‌‌ విద్యార్థుల మధ్య జరిగిన ఘర్షణ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. శనివారం ఇంటర్‌‌ సీనియర్‌‌, జూనియర్‌‌ విద్యార్థుల మధ్య చిన్నపాటి గొడవ చోటుచేసుకుని, పరస్పరం దాడి చేసుకున్నారు. ఘటనపై స్పందించిన ప్రిన్సిపాల్‌‌ గోవింద్‌‌రావు గొడవకు కారణమైన 11 మంది విద్యార్థుల తల్లిదండ్రులను స్కూల్​కు పిలిపించారు. గొడవపడ్డ విద్యార్థులను 15 రోజుల పాటు సస్పెండ్‌‌ చేశారు. ఈ విషయంపై ప్రిన్సిపాల్‌‌ను వివరణ కోరగా, విద్యార్థులపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నామని తెలిపారు.