వెండితెరపై ఐకానిక్ స్టైల్‌తో మెప్పించే తల అజిత్ కుమార్.. రియల్ లైఫ్‌లో రేసింగ్ ట్రాక్‌పై మళ్లీ తన విశ్వరూపం చూపించారు. స్పెయిన్‌లోని బార్సిలోనాలో ఉత్కంఠభరితంగా ముగిసిన మిషెలిన్ క్రివెంటిక్ 24 అవర్స్ యూరోపియన్ సిరీస్ 2026లో అజిత్ రెడ్‌యాంట్ రేసింగ్ టీమ్ (Ajith RedAnt Racing) సరికొత్త రికార్డు సృష్టించింది. రేసింగ్ ట్రాక్ పై భారత్ ను గర్వపడేలా చేశారు.
24 గంటల పాటు సాగిన ఈ సుదీర్ఘ పోరులో GT3 ప్రో-ఎమ్ (GT3 Pro-Am) కేటగిరీ రేసులో అజిత్ టీమ్ రెండో స్థానం సాధించింది. అంతేకాకుండా, ఈ సీజన్ మొత్తానికి గాను ఓవరాల్ GT3 ప్రో-ఎమ్ ఛాంపియన్‌షిప్‌లో మూడో స్థానం కైవసం చేసుకుని సంచలనం సృష్టించింది. దీంతో వరుసగా రెండో ఏడాది కూడా ఛాంపియన్‌షిప్ పోడియంపై నిలిచి తన డ్రైవింగ్ స్టామినాను అంతర్జాతీయ స్థాయికి చాటిచెప్పారు అజిత్ కుమార్.
ఈ రేసింగ్ ట్రాక్‌పై అజిత్ భారత్ త్రివర్ణ పతాకాన్ని గర్వంగా చేతపట్టుకుని నిలిచిన దృశ్యాలు, పోడియంపై ట్రోఫీతో తోటి రేసర్లతో కలిసి జరుపుకున్న వేడుకలు ప్రస్తుతం సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి. ఇది ప్రతి డ్రైవర్, ఇంజనీర్, మెకానిక్ పడ్డ కష్టానికి లభించిన విజయం అంటూ అజిత్ రేసింగ్ టీమ్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. ఈ ఘనతపై ప్రముఖ నటుడు మాధవన్ సో ప్రౌడ్ అఫ్ యూ అంటూ సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు చెబుతూ.. అజిత్‌ను ఆకాశానికెత్తేశారు.
ALSO READ : ‘ది ప్యారడైజ్’కు బుకింగ్స్‌లో బీభత్సమైన రెస్పాన్స్..
ఒకవైపు సినిమాల్లో నటిస్తూనే.. మరోవైపు రేసింగ్‌పై ఉన్న ప్యాషన్‌తో అజిత్ సాధిస్తున్న ఈ విజయాలు అభిమానులను ఎంతగానో ఉత్సహాపరుస్తున్నాయి. బార్సిలోనాతో పాటు దుబాయ్, ముగెల్లో, స్పా-ఫ్రాంకోర్‌చాంప్స్ వంటి గ్లోబల్ ట్రాక్‌లపై దూసుకెళ్లిన ఈ స్టార్ హీరో.. నవంబర్‌లో తన తదుపరి చిత్రం 'డేర్‌డెవిల్' (Daredevil) షూటింగ్‌లో పాల్గొననున్నారు. ఈ మూవీ ప్రకటన వచ్చినప్పటి నుంచే అభిమానుల అంచనాలు తారా స్థాయికి చేరాయి.
