గువహటి: అస్సాంలోని హైలాకండి జిల్లాలో అత్యంత అమానుష ఘటన వెలుగు చూసింది. 15 ఏండ్ల బాలికపై అఘాయిత్యానికి పాల్పడి, అత్యంత క్రూరంగా హత్య చేశారు. కట్లిచెర్ర పోలీస్ స్టేషన్ పరిధిలోని అలోయిచోరా ప్రాంతంలో శనివారం రాత్రి 11 గంటల సమయంలో ఈ దారుణం జరిగింది. ఆ రోజు బాలిక తన కుటుంబ సభ్యులతో కలిసి సమీపంలోని బంధువుల ఇంటికి విందుకు వెళ్లింది.
అక్కడ ఒక కజిన్‌తో జరిగిన చిన్న వాదన కారణంగా ఆ అమ్మాయి ఒంటరిగా ఇంటికి తిరిగొచ్చింది. రాత్రి కుటుంబ సభ్యులు ఇంటికి తిరిగి వచ్చేసరికి, బాలిక నేలపై విగతజీవిగా పడి ఉంది. ఆమె తల, ముఖం పూర్తిగా ఛిద్రమై ఉండటంతో కుటుంబ సభ్యులు మొదట ఆమెను గుర్తుపట్టలేకపోయారు. అంతేకాకుండా, బాలిక ప్రైవేట్ భాగాల్లో రాడ్ ఇరికించి రాక్షసంగా ప్రవర్తించారు.
తమ కూతురిపై అత్యాచారం జరిపి హత్య చేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ నేషనల్ హైవే-6ను దిగ్బంధించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఐదుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నామని చెప్పారు.
