మద్యం ప్రియులు ఇష్టంగా తాగే మందులో నిజంగా మందు ఉందా అనే డౌట్స్ ను క్లియర్ చేశారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. ప్రముఖ కంపెనీల రమ్, విష్కీ బ్రాండ్స్ కు కేవలం ఫ్లేవర్స్ జోడించి కస్టమర్స్ ను మోసం చేస్తున్న కంపెనీలపై చర్యలు తీసుకున్నారు. అందులో భాగంగా కొన్ని ప్రముఖ ఇండియన్ విస్కీ, రమ్ బ్రాండ్‌లలో కొన్ని బ్యాచ్‌ల అమ్మకాలను నిలిపివేసింది ఫుడ్ సేఫ్టీ సంస్థ. అనుమతి లేని ఫ్లేవర్స్ ( కృత్రిమ సువాసనలు) వాడుతున్నట్లు పరిశీలనలో తేలడంతో ఈ చర్యలు తీసుకున్నారు.
డయాజియో ఇండియా యూనైటెడ్ స్పిరిట్స్, ఇన్‌బ్రూ బెవరేజెస్ , మోహన్ రాకీ స్ప్రింగ్‌వాటర్ వంటి కంపెనీలు తయారు చేసిన ఉత్పత్తులపై ఈ నిషేధం విధించింది. ల్యాబ్ టెస్టులో విస్కీకి విస్కీ ఫ్లేవర్, రమ్‌కు రమ్ ఫ్లేవర్ వంటి ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ కలిపుతున్నట్లు గుర్తించారు.
నిషేధం విధించిన బ్రాండ్‌లు:
యూనైటెడ్ స్పిరిట్స్ (డయాజియో ఇండియా) మధ్యప్రదేశ్ యూనిట్‌లో తయారైన ఆంటిక్విటీ బ్లూ విస్కీ, రాయల్ ఛాలెంజ్ విస్కీ
ఇన్‌బ్రూ బెవరేజెస్ మధ్యప్రదేశ్‌లో తయారైన బ్యాగ్‌పైపర్ డీలక్స్ విస్కీ, ఓల్డ్ కాస్క్ డీలక్స్ XXX రమ్
మోహన్ రాకీ స్ప్రింగ్‌వాటర్ మహారాష్ట్రలో తయారైన ఓల్డ్ మాంక్ కు చెందిన మూడు రకాలు
