నటి త్రిషపై డీఎంకే నేత, మాజీ డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ చేసిన కామెంట్స్ తమిళనాట దుమారం రేపుతున్నాయి. ఓ బహిరంగ సభలో ఉదయనిధి స్టాలిన్ నటి త్రిషపై సంచలన కామెంట్స్ చేశారు. దీంతో ప్రతిపక్ష డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ పై చర్యలు తీసుకోవాలని జాతీయ మహిళ కమిషన్ ను ఆశ్రయించారు టీవీకే నేతలు.
తమిళనాడులో కావేరీ జలాల నిరసన సభలో డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ నటి త్రిషపై పరోక్షంగా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. సీఎం విజయ్‌ను విమర్శిస్తున్న సమయంలో జనాల నుంచి త్రిష నినాదాలు రాగా, ఆయన డబుల్ మీనింగ్ డైలాగ్ మాట్లాడారని ప్రతిపక్షాలు మండిపడ్డాయి. దీనిపై టీవీకే పార్టీ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేసింది.
టీవీకే నేతలు ,బీజేపీ నేతలు ఉదయనిధి స్టాలిన్ చేరసిన కామెంట్స్ ను తీవ్రంగా తప్పుబట్టారు. మహిళలను, నటులను రాజకీయాల్లోకి లాగి ఇలా మాట్లాడటం సిగ్గుచేటన్నారు. త్రిషకు బేషరతుగా బహిరంగ క్షమాపణ చెప్పాలని, మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించినందుకు అతనిపై పోలీసులు కేసు నమోదు చేయాలని టీవీకే నేతలు డిమాండ్ చేశారు.
