మేడ్చల్, వెలుగు: గ్యాస్ సిలిండర్ లీకై ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో తండ్రితో పాటు ముగ్గురు చిన్నారులు గాయపడ్డారు. పోలీసులు, స్థానికులు తెలిపిన ప్రకారం.. ఎల్లంపేట్ మున్సిపల్ పరిధిలోని శ్రీరంగవరం గ్రామానికి చెందిన చింతల శ్రీనివాస్(37) ఇంట్లో ఆదివారం గ్యాస్ సిలిండర్ లీకై మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో శ్రీనివాస్‌తో పాటు ఆయన కుమార్తెలు ప్రవళిక(14), హరిప్రియ(10), కొడుకు విక్రాంత్(6) గాయపడ్డారు. పేలుడు శబ్దం విన్న స్థానికులు వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. ఘటన స్థలానికి చేరుకున్న అంబులెన్స్ సిబ్బంది క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.
