సీఎంఆర్ మళ్లింపుపై పంచాయితీ..యాదాద్రి జిల్లాలో తనకు 6 వేల క్వింటాళ్ల వడ్లు ఇవ్వలేదని మిల్లర్ ఆరోపణ

సీఎంఆర్ మళ్లింపుపై పంచాయితీ..యాదాద్రి జిల్లాలో తనకు 6 వేల క్వింటాళ్ల వడ్లు ఇవ్వలేదని మిల్లర్ ఆరోపణ
  •     ఇద్దరు మిల్లర్లు అడ్జస్ట్ చేసుకున్నారంటున్న సివిల్ సప్లయ్ 
  •     ధాన్యం దారి మళ్లింపుతో ఇటీవల మిల్లర్ అరెస్టు
  •     హోటల్​సహా బ్లాక్ లో మిల్లర్ ప్రాపర్టీస్

యాదాద్రి, వెలుగు: యాదాద్రి భువనగిరి జిల్లాకేంద్రంలో సీఎంఆర్​ కేటాయింపు విషయంలో సివిల్​ సప్లై డిపార్ట్​మెంట్​కు, కొందరు మిల్లర్లకు పంచాయితీ నడుస్తోంది. తనకు వడ్లు ఇవ్వకుండానే ఇచ్చినట్టుగా సివిల్​సప్లై​ అధికారులు రాసుకున్నారని ఓ మిల్లర్ ఆరోపిస్తుండగా.. ఆ వడ్లను ఇద్దరు మిల్లర్లు అడ్జస్ట్​ చేసుకున్నారని సివిల్​ సప్లై​ డిపార్ట్మెంట్ చెబుతోంది. కాగా మూడు రోజుల కింద మిల్లర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను పోలీసులు అరెస్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు. కాగా సీఎంఆర్​ గోల్​మాల్​పై  మిల్లర్​ భాగస్వాముల మధ్య విభేదాలు ఉన్నట్లు అధికారులు తేల్చారు. ఈక్రమంలోనే సదరు మిల్లర్లు సివిల్​ సప్లై అధికారులపై ఆరోపణలు చేస్తున్నట్లు సమాచారం. 

రూ.1.74 కోట్ల విలువైన వడ్ల గోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మాల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 

భువనగిరిలోని యాదాద్రి రైస్​ మిల్లులో ఇటీవల ఎఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సీఐ ఆఫీసర్లు తనిఖీలు నిర్వహించారు. సీఎంఆర్​ కోసం 6,668 టన్నులు వడ్లు కేటాయించగా.. కేవలం 160 టన్నులు వడ్లు మాత్రమే ఉన్నాయి. దీంతో మిల్లును డిఫాల్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా గుర్తించడంతో పాటు సీఎంఆర్​ తీసుకోమని స్పష్టం చేశారు. దీంతో మిల్లు యజమాని నూనె వెంకటేశ్వర్లుపై సివిల్​ సప్లయ్ ఆఫీసర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో శనివారం ఆయనను అరెస్ట్​ చేశారు. 

కాగా తనకు 2024–-25 వానాకాలం సీజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రూ. 1.74 కోట్ల విలువైన 6 వేల క్వింటాళ్ల వడ్లు ఇవ్వకుండానే ఇచ్చినట్టుగా సివిల్​ సప్లై​ఆఫీసర్లు రాసుకున్నారని పోలీసుల విచారణలో వెంకటేశ్వర్లు ఆరోపించారు. ఇదే విషయాన్ని పోలీసులకు రాతపూర్వకంగా అందచేసినట్లు తెలిసింది. కాగా వెంకటేశ్వర్లు చేస్తున్న ఆరోపణలను సివిల్​ సప్లై ​ఆఫీసర్లు తోసిపుచ్చారు. యాదాద్రి మిల్లులో వెంకటేశ్వర్లుతోపాటు నలుగురు భాగస్వాములు ఉన్నారని, ఇందులో రామన్నపేట మండలంలోని ఓ మిల్లులో 6 వేల క్వింటాళ్ల వడ్లు అన్​లోడ్​ చేసుకున్నారని పేర్కొన్నారు. దీనికి సంబంధించిన ట్రాక్​ షీట్లు యాదాద్రి మిల్లు పేరుతోనే ఉన్నాయని ఆఫీసర్లు చెబుతున్నారు.

రూ.కోట్ల విలువైన ఆస్తులు బ్లాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

యాదాద్రి మిల్లులో ఉండాల్సిన స్టాక్​ 6,668 టన్నుల వడ్లు, 2022–23 యాసంగి సీజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు సంబంధించిన టెండర్​ బకాయి కలిపి రూ. 24 కోట్లు మిల్లర్​చెల్లించాల్సి ఉంది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు మిల్లర్​, అతడి భాగస్వాములకు సంబంధించిన ఆస్తులను బ్లాక్​ చేయించారు. భువనగిరి మెయిన్​ రోడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ఉన్న హోటల్​సహా బ్లాక్​ చేసిన 14 ఆస్తులు సీజ్ చేశారు. ఈ హోటల్​ విషయంలో భాగస్వాముల మధ్య విభేదాలు తలెత్తినట్లు సమాచారం. 

నాలుగు  మిల్లుల స్టాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తేడా

జిల్లాలోని  మరో నాలుగైదు మిల్లుల్లోని స్టాక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తేడా ఉన్నట్టు సివిల్​ సప్లయ్ ఆఫీసర్లు గుర్తించారు. ఇందులో రామన్నపేట మండలంలో భాగస్వాములు నిర్వహిస్తున్న రైస్​ మిల్లుతో పాటు భువనగిరి, ఆలేరు మండలాల్లోని రైస్​ మిల్లుల్లో భారీగా స్టాక్​ తేడా ఉందని తెలుస్తోంది. దీంతో ఈ మిల్లులకు గత సీజన్లలో ఇచ్చిన స్టాక్​, అప్పగించిన సీఎంఆర్​ వివరాలను విజిలెన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు జిల్లా ఆఫీసర్లు అందించారు. టెండర్​వడ్లకు సంబంధించిన రూ. 32 కోట్ల బకాయిల్లో రెండు మిల్లులు మాత్రమే భారీ మొత్తంలో చెల్లించాల్సి ఉందని మిల్లర్లే చెబుతున్నారు. కాగా ఆ మిల్లులను త్వరలో విజిలెన్స్​ ఆఫీసర్లు తనిఖీ చేయనున్నట్టు తెలిసింది. 

మిల్లుల్లో రూ.1300 కోట్ల వడ్లు

జిల్లాలోని మిల్లుల్లో మూడు సీజన్ల వడ్లు పేరుకుపోయాయి. 2023 యాసంగి సీజన్​కు చెందిన వడ్లకు సంబంధించి రూ. 43 కోట్లు చెల్లించాలని మిల్లర్లను ప్రభుత్వం ఆదేశించింది. 2025 యాసంగికి చెందిన 47, 136 టన్నుల వడ్లు, 2025 వానాకాలం వడ్లు 1,86,344 టన్నులు, 2026 యాసంగిలో 3.10 లక్షల టన్నుల వడ్లను అప్పగించారు. ఈ మూడు సీజన్లకు సంబంధించిన వడ్లు, 2023 యాసంగి సీజన్​కు సంబంధించిన రూ.32 కోట్లు కలిపి మిల్లర్ల వద్ద సుమారు రూ. 1300 కోట్లు విలువైన వడ్లు ఉన్నాయి. అయితే ఈ మిల్లుల్లో ఈ స్థాయిలో వడ్లు ఉన్నాయా..? దారి మళ్లించారా..? అన్న అనుమానాలు 
వ్యక్తమవుతున్నాయి.