రాత్రికి భారీ వర్షాలు.. అత్యవసరం అయితే తప్ప బయటకు రాకండి: సీపీ సజ్జనార్

రాత్రికి భారీ వర్షాలు.. అత్యవసరం అయితే తప్ప బయటకు రాకండి: సీపీ సజ్జనార్

హైదరాబాద్ సిటీ వ్యాప్తంగా సోమవారం (ఆగస్టు 03)  రాత్రి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉన్నట్లు వాతావరణ కేంద్రం హెచ్చరించిన క్రమంలో సీపీ సజ్జనార్ కీలక సూచనలు చేశారు.  హైదరాబాద్ ప్రజలందరూ అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

అత్యవసర పరిస్థితి ఉంటే తప్ప అనవసర ప్రయాణాలు చేయవద్దని చెప్పారు. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ఇళ్ల నుంచి బయటకు రావద్దని సూచించారు.  బయట ఉన్నవారు వర్ష తీవ్రత పెరిగే లోపే పనులను త్వరగా ముగించుకుని క్షేమంగా ఇళ్లకు చేరుకోవాలని సలహా ఇచ్చారు.

ముఖ్యంగా నీరు నిలిచిన రహదారులు, ముంపునకు గురయ్యే లోతట్టు ప్రాంతాల గుండా ప్రయాణాలు చేయడం అస్సలు సురక్షితం కాదని హెచ్చరించారు. వాహనదారులు డ్రైవింగ్ చేసేటప్పుడు వేగం తగ్గించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. అత్యవసర సమయాల్లో అప్రమత్తంగా ఉంటూ అందరూ సురక్షితంగా ఇళ్లకు చేరుకోవాలని విజ్ఞప్తి చేశారు.