స్టూడెంట్ల కోసం ప్రత్యేక బస్సులు నడపాలి : ప్రభుత్వ సలహాదారు పోచారం

స్టూడెంట్ల కోసం ప్రత్యేక బస్సులు నడపాలి : ప్రభుత్వ సలహాదారు పోచారం

బీర్కూర్, వెలుగు: స్టూడెంట్లు టైమ్​కు కాలేజీలకు వెళ్లలేకపోతే ఇబ్బందులు ఎదురవుతాయని, వారి కోసం ప్రత్యేక బస్సులు నడపాలని వ్యవసాయ శాఖ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆర్టీసీ అధికారులకు సూచించారు. పోచారం శుక్రవారం బాన్సువాడ నుంచి బీర్కూర్ మండలం తిమ్మాపూర్​కు వెళ్తుండగా కిష్టాపూర్ వద్ద స్టూడెంట్లు బస్సు కోసం వేచి ఉండటాన్ని గమనించి తన వెహికల్​ఆపి వారితో మాట్లాడారు.

బస్సులు సమయానికి రాకపోవడంతో కాలేజీకి చేరుకోవడానికి ఇబ్బందులు పడుతున్నామని వారు ​చెప్పారు. దీంతో బాన్సువాడ ఆర్టీసీ డిపో మేనేజర్ రవికుమార్​తో ఫోన్‌‌‌‌‌‌‌‌లో మాట్లాడిన పోచారం.. బాన్సువాడ నుంచి ఎస్ఆర్ఎన్​కే డిగ్రీ కాలేజీ వరకు బీర్కూర్, కిష్టాపూర్, తిమ్మాపూర్, బొమ్మందేవ్‌‌‌‌‌‌‌‌పల్లి చౌరస్తా మార్గంలో ఉదయం బస్సు సర్వీసు ఏర్పాటు చేయాలని సూచించారు. 

బోనం ఎత్తుకున్న పోచారం

వర్ని, వెలుగు: ఆషాఢమాస బోనాల పండగ సందర్భంగా నిజామాబాద్ ​జిల్లా వర్ని మండల కేంద్రంలో శుక్రవారం వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది ఆధ్వర్యంలో  నిర్వహించిన బోనాల పండగలో పోచారం శ్రీని వాస్ రెడ్డి పాల్గొన్నారు. బోనం ఎత్తుకొన్నారు. పాడి పంటలతో ప్రజలు సల్లగా ఉండాలని, గ్రామాలు అభివృద్ధి పథంలో నడవాలని మొక్కుకున్నారు.