ఏసీబీ చిక్కిన నిజామాబాద్‌ మున్సిపల్ అకౌంట్స్‌ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌, కంప్యూటర్ ఆపరేటర్

ఏసీబీ చిక్కిన నిజామాబాద్‌ మున్సిపల్ అకౌంట్స్‌ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌, కంప్యూటర్ ఆపరేటర్
  • రూ.15వేలు లంచం తీసుకుంటూ రెడ్‌‌‌‌‌‌‌‌హ్యాండెడ్‌‌‌‌‌‌‌‌గా దొరికిన వైనం

నిజామాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: నిజామాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మున్సిపల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అకౌంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పైడా అశోక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఆడిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సెక్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కంప్యూటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆపరేటర్‌‌‌‌‌‌‌‌(ఔట్‌‌‌‌‌‌‌‌సోర్సింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌) కలకుంట్ల కిరణ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సోమవారం ఏసీబీకి చిక్కారు. మున్సిపల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రిటైర్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎంప్లాయ్‌‌‌‌‌‌‌‌ పెన్షన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మంజూరుకు సంబంధించి ఇంక్రిమెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రొసీడింగ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రిపేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసి సర్వీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ బుక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నమోదు చేయడానికి రూ.15 వేలు లంచం తీసుకుంటూ అడ్డంగా బుక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అయ్యారు.

  రిటైర్డ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎంప్లాయ్‌‌‌‌‌‌‌‌ను నాలుగు నెలలుగా తిప్పుతూ రూ.25 వేల లంచం డిమాండ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేశారు. ఆమె తన కొడుకుకు విషయం చెప్పగా అతను ఏసీబీని ఆశ్రయించారు. ప్లాన్‌‌‌‌‌‌‌‌లో భాగంగా రూ.15 వేలకు డీల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కుదుర్చుకొని సీతారాంనగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కాలనీ సమీపంలోని ఒక కుల సంఘం బిల్డింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వద్ద లంచం తీసుకుంటుండగా ఏసీబీ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చార్జ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డీఎస్పీ సుదర్శన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ టీం వారిని రెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హ్యాండెడ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా పట్టుకున్నారు.

 తరువాత వారిద్దరిని మున్సిపల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు తీసుకొచ్చి సోదాలు నిర్వహించారు. కేసు నమోదు చేసి నాంపల్లి ఏసీబీ కోర్టుకు తరలించారు. ఈ ఘటన మున్సిపల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కార్పొరేషన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో కలకలం సృష్టించింది. ఆఫీస్‌‌‌‌‌‌‌‌లో సోదాలు చేయగా.. మధ్యాహ్న భోజనానికి బయటకు వెళ్లిన స్టాఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ తిరిగి రాలేదు.