నిజామాబాద్, వెలుగు: కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం వెంకటాపూర్ తండాకు చెందిన పేద గిరిజన విద్యార్థిని మెగావత్ నిషా ఎంబీబీఎస్ సీటు సాధించగా.. ఆమె చదువులకు నిజామాబాద్ కు చెందిన డాక్టర్ దంపతులు అండగా నిలిచారు.
నీట్ లో 407 మార్కులు సాధించిన నిషాకు హైదరాబాద్‌లోని నోవా మెడికల్ కాలేజీలో సీట్ వచ్చింది. పేదరికం కారణంగా ఫీజు చెల్లించడానికి ఆమె పడుతున్న ఇబ్బంది తెలుసుకున్న నిజామాబాద్‌కు చెందిన డాక్టర్ మధుకర్, డాక్టర్ శ్రీలత రాథోడ్ ఆమెకు ఆర్థిక సాయం చేశారు.
