వైఎస్ఆర్ తనయురాలు, ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల తన అన్న జగన్తో రాజీకొచ్చారని.. త్వరలో ఆమె వైసీపీలోకి రీఎంట్రీ ఇస్తారని సోషల్ మీడియాలో, కొన్ని మీడియా ఛానల్స్లో వచ్చిన కథనాలపై వైఎస్ షర్మిల స్పందించారు. ‘ఎక్స్’లో ఈ విషయంలో ఆమె వివరణ ఇచ్చారు. తాను ఎవరినో కలిసినట్లు, ఎక్కడో చేరిపోతున్నట్లు, తన మీద సోషల్ మీడియాలో అల్లుతున్నవి కట్టుకథలని ఆమె తేల్చి చెప్పారు. చేస్తున్న విశ్లేషణలు పూర్తిగా నిరాధారమైనవని, జరుగుతున్న ప్రచారం శుద్ధ అబద్ధమని షర్మిల ట్వీట్ చేశారు.
నేను ఎవరినో కలిసినట్లు, ఎక్కడో చేరిపోతున్నట్లు, నా మీద సోషల్ మీడియాలో అల్లుతున్నవి కట్టుకథలు. చేస్తున్న విశ్లేషణలు పూర్తిగా నిరాధారం. జరుగుతున్న ప్రచారం శుద్ధ అబద్ధం. గిట్టని వాళ్ళవి పస లేని ఆరోపణలు. ఇది నేను తీవ్రంగా ఖండిస్తున్నా.
— YS Sharmila (@realyssharmila) September 22, 2026
వైసీపీ అధ్యక్షులు జగన్ మోహన్ రెడ్డి గారిని… pic.twitter.com/FlcYeXRP2f
గిట్టని వాళ్ళవి పస లేని ఆరోపణలని, ఈ ప్రచారాన్ని తాను తీవ్రంగా ఖండిస్తున్నానని ఆమె పోస్ట్ చేశారు. వైసీపీ అధ్యక్షులు జగన్ మోహన్ రెడ్డిని తాను చివరిసారిగా కలిసింది కూడా తన కుమారుడు వైఎస్ రాజారెడ్డి వివాహానికి ఆహ్వానించిన సమయంలోనేనని ఆమె గుర్తుచేశారు. మళ్లీ ఇప్పుడు కలిసినా.. తన కుమార్తె వైఎస్ అంజిలి రెడ్డి వివాహ ఆహ్వాన పత్రికను అందించడానికి మాత్రమేనని షర్మిల కుండబద్ధలు కొట్టారు.
అన్ని రాజకీయ పార్టీల అధినేతలను తన బిడ్డ పెళ్లికి రావాలని, దీవించాలని ఆహ్వానిస్తానని. ఇందులో కొత్తేం లేదని.. వింత అంతకన్నా కాదని ఆమె తన పోస్ట్లో పేర్కొన్నారు. కన్న కూతురు వివాహాన్ని అడ్డుపెట్టుకొని తెర వెనుక రాజకీయాలు చేసుకొనే ఖర్మ YSR బిడ్డగా తనకు లేదని షర్మిల స్పష్టం చేశారు. శుభకార్యానికి, రాజకీయానికి లింకులు పెట్టి, తన విశ్వసనీయతను, రాజకీయ ప్రామాణికతను, ప్రజలు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని దెబ్బతీయాలని చూస్తే ఊరుకునేది లేదని వైఎస్ షర్మిల హెచ్చరించారు.
