పండగయినా.. పబ్బం అయినా బంధువులు, ఫ్రెండ్స్‌కు శుభాకాంక్షలు చెప్పడం కామన్. గతంలో ఉత్తరాల ద్వారా చెప్పేవారు.. ఆ తరువాత టెలిగ్రామ్ కల్చర్.. టెలిఫోన్ ద్వారా... మొబైల్ ద్వారా.. ఇప్పుడు వాట్సప్ ద్వారా శుభాకాంక్షలు చెపుతున్నారు. కాలం మారే కొద్ది ఆధునికత కూడా మారింది కదా. మరీ ఈ పరాభవ నామ సంవత్సర ఉగాది పండుగ రోజున మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు శుభాకాంక్షలు తెలపండి. ప్రత్యేకంగా కొన్ని ఉగాది శుభాకాంక్షల సందేశాలను ఈ ఆర్టికల్లో అందిస్తున్నాము. మీకు నచ్చిన దానిని ఎంపిక చేసుకొని మీ శ్రేయోభిలాషులకు ఉగాది పండగ శుభాకాంక్షలు తెలపండి.
తెలుగులో కొన్ని ఉగాది శుభాకాంక్షలు
- షడ్రుచుల సమ్మేళనంలా మీ జీవితం తీపి, వగరు, చేదుల కలయికతో సాఫీగా సాగాలని.. ఈ ఉగాది మీకు సకల శుభాలను చేకూర్చాలని కోరుకుంటూ.. మీకు మీ కుటుంబ సభ్యులకు ఉగాది శుభాకాంక్షలు
- శ్రీ పరాభవ నామ సంవత్సరం మీకు మరియు మీ కుటుంబానికి ఆయురారోగ్యాలను, అష్టైశ్వర్యాలను ప్రసాదించాలని మనసారా ఆకాంక్షిస్తున్నాను. హ్యాపీ ఉగాది
- వసంతం రాకతో ప్రకృతి పులకించినట్లు, ఈ ఉగాది మీ జీవితంలో సరికొత్త ఆశలను, ఆనందాలను తీసుకురావాలి. నూతన సంవత్సర శుభాకాంక్షలు
- కొత్త చిగురులు, కొత్త కోరికలు, కొత్త ఆశలతో వస్తున్న ఈ తెలుగు సంవత్సరాది మీకు అన్ని విధాలా విజయాన్ని చేకూర్చాలి. ఉగాది శుభాకాంక్షలు
- తెలుగింటి వారికి ఈ నూతన సంవత్సరంబాగా కలిసి రావాలని కోరుకుంటూ అందరికీ ఉగాది శుభాకాంక్షలు.
- మీకు మీ కుటుంబ సభ్యులకు శ్రీ క్రోధి నామ సంవత్సరంశుభాకాంక్షలు.
- అమెరికా అయినా రష్యా అయినా, హాంకాంగ్ అయినా బ్యాంకాక్ అయినా ఉగాది పండుగని ఆనందంగా జరుపుకో, మన సంప్రదాయాన్ని నిలుపుకో. అందరికీ ఉగాది శుభాకాంక్షలు.
- ఈ ఉగాది మీకు శాంతి, సుఖసంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీకు ఉగాది శుభాకాంక్షలు.
- ఉగాది అంటే అన్నీకొత్తవే, కొత్త జీవితం, కొత్త ఆశలు, కొత్త ఆకాంక్షలు. ఈ తెలుగు నూతన సంవత్సరం శాంతి, సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతుడిని కోరుకుంటూ ఉగాది శుభాకాంక్షలు .
- మీరు అనుకున్నవన్నీ జరగాలని, మీ లక్ష్యాలను మీరు సాధించాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తూ మీకు ఉగాది శుభాకాంక్షలు .
- లేత మామిడి ఆకుల తోరణాలు, శ్రావ్యమైన సన్నాయి రాగాలు, అందమైన ముగ్గులతో వీధి వాకిళ్లు, కొత్తబట్టలతో పిల్లాపాపలు అందరికీ ఉగాది శుభాకాంక్షలు.
- జీవితం సకల అనుభూతుల మిశ్రమంస్థిత ప్రజ్ఞత అలవరచుకోవడం వివేకి లక్షణంఅదే ఉగాది తెలిపే సందేశంమీకు, మీ కుటుంబ సభ్యులకు ఉగాది శుభాకాంక్షలు
- మీ పిల్లలు విద్యలో, మీరు ఉద్యోగంలో, మీ కుటుంబం అనుబంధంలో, జయకేతనం ఎగరవేయాలని కోరుతూ.. మీకు మీ కుటుంబ సభ్యులకు ఉగాది శుభాకాంక్షలు
