పోకో భారత మార్కెట్లో తన ఎక్స్-సిరీస్ లైనప్‌లో రెండు కొత్త స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేసింది. ఈ కంపెనీ కొత్త పోకో ఎక్స్8 ప్రో, ఎక్స్8 ప్రో మాక్స్‌లను విడుదల చేసింది.ఈ రెండు హ్యాండ్‌సెట్‌లు వేగంగా పవర్ ఫుల్ పనితీరు గల డివైజ్ కోరుకునే వారి కోసం ముఖ్యంగా గేమర్‌లు , హ్యాండ్‌సెట్‌లను రఫ్ గా వినియోగించేవారికోసం ఈ స్మార్ట్ ఫోన్లు రూపొందించారు. Poco X8 Pro Max స్మార్ట్‌ఫోన్ మార్చి 17, 2026న మన దేశంలో అధికారికంగా విడుదలైంది. ఈ ఫోన్ ప్రధానంగా దాని భారీ బ్యాటరీ ,అత్యంత వేగవంతమైన ప్రాసెసర్‌తో ఫ్లాగ్‌షిప్ కిల్లర్ గా నిలుస్తోంది.
డిస్‌ప్లే (Display)
6.83 అంగుళాల పరిమాణంలో1.5K AMOLED స్క్రీన్ డిస్ ప్లే తో వస్తుంది. 120Hz (అడాప్టివ్) రిఫ్రెష్ రేట్, 3,500 నిట్స్ (Peak Brightness) - ఎండలో కూడా చాలా స్పష్టంగా కనిపించే బ్రైట్‌నెస్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ,3840Hz PWM డిమ్మింగ్ కళ్లకు రక్షణ కోసం ప్రొటెక్షన్ ఉంటుంది.
పనితీరు.. MediaTek Dimensity 9500s (3nm చిప్‌సెట్) తో ప్రాసెసర్ తో అద్భుతంగా పనిచేస్తుంది. ఈ ప్రాజెసర్ ను భారత్ లో మొదటిసారిగా ఈ ఫోన్‌లో పరిచయం చేశారు. 3.1 మిలియన్ల కంటే ఎక్కువ AnTuTu స్కోరుతో ఇది గేమింగ్‌కు అత్యుత్తమమైనది హ్యాండ్ సెట్. ఇక RAM/స్టోరేజ్ విషయానికి వస్తే..12GB LPDDR5X RAM ,256GB / 512GB UFS 4.1 స్టోరేజ్ కలిగి ఉంటుంది. 3D IceLoop కూలింగ్ సిస్టమ్ ఫోన్ వేడెక్కకుండా కూలింగ్ చేస్తుంది.
కెమెరా.. వెనుక కెమెరా: 50MP మెయిన్ కెమెరా (Light Fusion 600 సెన్సార్, OIS సపోర్ట్) + 8MP అల్ట్రా-వైడ్ లెన్స్ ఉంటుంది. సెల్ఫీ కెమెరా: 20MP ఫ్రంట్ కెమెరా ఉంటుంది. వీడియో: వెనుక కెమెరాతో 4K @ 60fps వరకు వీడియో రికార్డింగ్ చేయవచ్చు.
బ్యాటరీ ,ఛార్జింగ్.. 9,000mAh సామర్థ్యం గల సిలికాన్-కార్బన్ బ్యాటరీ ఉంటుంది. ఇది ఈ ఫోన్ లో అతిపెద్ద ప్లస్ పాయింట్. 100W HyperCharge ఛార్జర్ బాక్స్‌లోనే లభిస్తుంది. ఎక్కువ కాలం ఛార్జింగ్ ఉంటుంది. ఇందులో రివర్స్ ఛార్జింగ్ కూడా చేసుకోవచ్చు. 27W రివర్స్ వైర్డ్ ఛార్జింగ్ తో ఇతర ఫోన్లను ఛార్జ్ చేయవచ్చు.
ఇతర కీ ఫీచర్లు.. ఈ హ్యాండ్ సెట్లలో ఆండ్రాయిడ్ 16 ఆధారిత HyperOS 3.0. ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది. IP66, IP68, IP69 ,IP69K రేటింగ్ తో వాటర్, డస్ట్, నుంచి ప్రొటెక్షన్ ఉంటుంది.
బయోమెట్రిక్స్: అల్ట్రాసోనిక్ ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉంటుంది. ఇది తడి చేతులతో కూడా పనిచేస్తుంది.
కనెక్టివిటీ: Wi-Fi 7, బ్లూటూత్ 6.0, NFC, IR బ్లాస్టర్ లతో కనెక్టివిటీ ఉంటుంది.
ధర ,లభ్యత ..
ధర విషయానికివస్తే Poco X8 Pro మ్యాక్స్ స్మార్ట్ ఫోన్ గేమింగ్ బెస్ట్ వన్.. బడ్జెట్ ఫోన్ కూడా.
- 8GB RAM , 256GB స్టోరేజ్ వేరియంట్ X8 ప్రో ధర రూ. 29,999 నుంచి ప్రారంభమవుతుంది.
- 12GB RAM ,256GB స్టోరేజ్ కోసం ధర రూ. 32వేల 999లు
X8 ప్రో మాక్స్ ధర:
- 12GB RAM ,256GB స్టోరేజ్ ధర రూ. 39వేల999
- 12GB RAM ,512GB స్టోరేజ్ ధర రూ. 43వేల999
సేల్: మార్చి 23, 2026 మధ్యాహ్నం 12 గంటల నుంచి Flipkartలో ప్రారంభమవుతుంది. బ్యాంకు డిస్కౌంట్ నుంచి అదనంగా రూ. 2,000 తగ్గింపును పొందవచ్చు.
మీరు రోజుకు 10నుంచి-12 గంటలు ఫోన్ వాడినా, భారీ గేమింగ్ చేసినా బ్యాటరీ అయిపోతుందనే భయం లేకుండా ఉండే ఫోన్ కావాలంటే Poco X8 Pro Max ఒక అద్భుతమైన ఎంపిక.
