హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు పదవి కాలాన్ని కేంద్ర ప్రభుత్వం మరో మూడు నెలలు పొడగించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి బుధవారం (మార్చి 18) సమాచారం అందించింది. కాగా, రామకృష్ణారావు పదవి కాలం గతేడాది ఆగస్టులోనే ముగిసింది.
అయితే.. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు ఆయన పదవి కాలాన్ని కేంద్ర ప్రభుత్వం ఏడు నెలలు పొడగించింది. ఎక్స్టెన్షన్ ప్రకారం రామకృష్ణ రావు పదవీకాలం 2026, మార్చి 31న ముగియనున్నది. ఈ క్రమంలో సీఎస్ పదవి కాలాన్ని మరో 3 నెలలు ఎక్స్టెన్షన్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం మరోసారి కేంద్రాన్ని కోరింది.
రాష్ట్ర ప్రభుత్వ అభ్యర్థనపై పాజిటివ్‌గా స్పందించిన కేంద్రం సీఎస్ రామకృష్ణారావు పదవి కాలాన్ని మరో 3 నెలులు పొడగించింది. కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రామకృష్ణ రావు పదవి కాలాన్ని మూడు నెలలు పొడగిస్తున్నట్లు బుధవారం (మార్చి 18) డీవోపీటీ రాష్ట్ర ప్రభుత్వానికి సమాచారం అందించింది.
