NEET పేపర్ లీకేజీపై దేశ వ్యాప్త ఉద్యమంతో సంచలనం సృష్టించిన కాక్రోచ్ జనతాపార్టీ మరో ఉద్యమానికి సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది. ఈ సారి ఈ20 పెట్రోల్ పై మరో ఆందోళనకు సిద్ధమవుతోంది. సీజేపీ పార్టీ కోర్ కమిటీ రెండు రోజుల మీటింగ్ లో దానికి సంబంధించిన ఎజెండా నిర్ణయించనున్నారు. ఆగస్టు 05, 06వ తేదీలలో మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్ లో జరిగే కోర్ టీమ్ మీటింగ్ లో సీజేపీ భవిష్యత్ ప్రణాళికకు సంబంధించిన కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.
సీజేపీ పార్టీ ఫౌండర్ అభిజిత్ దీప్కే నివాసంలో జరుగుతున్న మీటింగ్ కు ఆ పార్టీ కోర్ టీమ్ హాజరు కానుంది. ప్రధాన ఎజెండా ఈ20 పెట్రోల్ పాలిసీపైనే ఉంటుందని టాక్.
జంతర్ మంతర్ ఆందోళనతో కేంద్ర మాజీ విద్యామంత్రి ధర్మేంద్ర ప్రదాన్ రాజీనామా చేయించే వరకు వచ్చిన ఉద్యమం తరహాలోనే.. దేశంలో మరో ఆందోళనకు సిద్ధమవుతోంది సీజేపీ. ఇథనాల్ బ్లెండెడ్ ఇంధనం, నిరుద్యోగం, ప్రభుత్వ సంస్థలపై ప్రజల్లో తగ్గుతున్న నమ్మకం తో పాటు మీడియా, జుడీషియరీ అంశాలపై కోర్ టీమ్ మీటింగ్ లో చర్చించనున్నారు. ముఖ్య ఎజెండా ఈ20 పెట్రోల్ పై నడుస్తున్నట్లు టాక్.
సీజేపీ సీనియర్ మెంబర్, స్పోక్ పర్సన్ సౌరవ్ దాస్ తో పాటు కోర్ కమిటీ ఈ సమావేశంలో పాల్గొంటుంది. ఈ20 పెట్రోల్ పై దేశ వ్యాప్తంగా ఆందోళన నెలకొన్న సమయంలో ఈ మీటింగ్ జరుగుతుండటం ఆసక్తికర పరిణామంగా మారింది. ఈ20 ఫ్యుయెల్ కారణంగా ఇంజిన్ సామర్థ్యం దెబ్బతినటం, మైలేజీ తగ్గటం, పాత వాహనాలలో తుక్కు మొదలైన సమస్యలు రావటంపై దేశ వ్యాప్తంగా వాహనదారుల్లో ఆందోళన నెలకొంది.
ALSO READ : ఇంజనీర్లకు క్రేజీ ఆఫర్: 2 నెలల ఇంటర్న్‌షిప్‌కు రూ.57 లక్షలు పేమెంట్!
మరోవైపు సీజేపీ రాజకీయ పార్టీగా అవతరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు వస్తున్న ఊహాగానాలను ఆ పార్టీ ఫౌండర్ దీప్కే కొట్టిపారేశారు. దేశంలో ఉన్న సమస్యలకు రాజకీయ పార్టీ పరిష్కారం కాదు. ప్రాజా పోరాటాలతోనే దేశంలో మార్పులు తెస్తామని అంటున్నారు. సీజేపీ భవిష్యత్ లక్ష్యాలపై కోర్ కమిటీ మీటింగ్ లో చర్చించనున్నట్లు తెలిపారు. దానికి సంబంధించిన పూర్తి వివరాలు సమావేశం తర్వాత వెల్లడించనున్నట్లు చెప్పారు.
