చిరంజీవి హీరోగా బాబీ కొల్లి దర్శకత్వంలో కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కె. నారాయణ నిర్మిస్తున్న చిత్రం ‘కాకా’. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఆసక్తికరమైన అప్డేట్ వచ్చింది. ఆదివారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న చిరంజీవి స్వయంగా తన పాత్ర పేరును లీక్ చేశారు. ఈ సినిమాలో ఆయన ‘కదిరి కాళిదాస్’గా కనిపించనున్నట్టు రివీల్ చేశారు. పవర్‌ఫుల్‌గా ఉన్న ఈ పేరు సినిమాపై అంచనాలను పెంచుతోంది.
హై-ఇంటెన్సిటీ యాక్షన్‌తో పాటు ఎమోషన్, ఫ్యామిలీ ఎలిమెంట్స్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. అనస్వర రాజన్, నివేదా పేతురాజ్, సునీల్, గెటప్ శ్రీను కీలక పాత్రలు పోషిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన టైటిల్ గ్లింప్స్‌కు మంచి రెస్పాన్స్ రాగా, సంక్రాంతి సందర్భంగా జనవరి 13న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
