గ్రేట్ అడ్వెంచర్ మూవీగా సత్యదేవ్ హీరోగా సమవర్తి.. టీజర్ రిలీజ్

గ్రేట్ అడ్వెంచర్ మూవీగా సత్యదేవ్ హీరోగా సమవర్తి.. టీజర్ రిలీజ్

సత్యదేవ్ హీరోగా ‘ఆరంభం’ ఫేమ్ అజయ్ నాగ్. వి దర్శకత్వంలో రూపొందుతున్న ఎకోలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ ‘సమవర్తి’. శివచరణ్ రెడ్డి  జక్కిడి, శశిధర్ రెడ్డి పడమటి నిర్మిస్తున్నారు. తాజాగా టీజర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ లాంచ్ ఈవెంట్‌‌ను నిర్వహించారు.

ఈ సందర్భంగా సత్యదేవ్ మాట్లాడుతూ ‘నేనొక ఇంట్రోవర్ట్‌‌‌‌‌‌‌‌ని. నాతో సినిమా చేయమని ఇంతవరకు ఎవరినీ అడగలేదు. కానీ ఈ చిత్ర దర్శకుడు  అజయ్‌‌‌‌‌‌‌‌ను అడిగాను. నేను డ్రీమ్‌‌‌‌‌‌‌‌గా భావించిన షాట్స్, సీన్స్ అతను నాతో చేయించాడు. సౌత్‌‌‌‌‌‌‌‌ ఇండియాలో ఎన్ని అడవులు ఉన్నాయో అన్నింట్లో షూటింగ్ చేశాం. 

ఇది మాకొక గ్రేట్ అడ్వెంచర్ అనిపించింది. థియేటర్స్‌‌‌‌‌‌‌‌లో ప్రేక్షకులకు కూడా అదే ఫీల్ కలిగిస్తుంది’ అని చెప్పాడు. ఇందులో కొత్త సత్యదేవ్‌‌‌‌‌‌‌‌ను చూడబోతున్నారని, తాను ఓ డిఫరెంట్‌‌‌‌‌‌‌‌ క్యారెక్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో నటించానని శ్రీకాంత్‌‌‌‌‌‌‌‌ తెలిపారు.

డైరెక్టర్ అజయ్ నాగ్.వి. మాట్లాడుతూ.. ‘సత్యదేవ్‌‌‌‌‌‌‌‌ ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డారు. ఆయనకు దీంతో థియేట్రికల్ బ్లాక్ బస్టర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇవ్వబోతున్నాం’ అని చెప్పాడు. తమ జీవితంలో తీసుకున్న బెస్ట్ డెసిషన్  ఈ సినిమాను ప్రొడ్యూస్ చేయడమేనని, టీమ్‌‌‌‌‌‌‌‌ మెంబర్స్‌‌‌‌‌‌‌‌ అందరికీ గుర్తుండిపోయే విజయం రాబోతోందని నిర్మాతలు శశిధర్, శివచరణ్ రెడ్డి జక్కిడి చెప్పారు.

హీరోయిన్ గానవి లక్ష్మణ్, నటుడు మోహన్ భగత్, మ్యూజిక్ డైరెక్టర్ సింజిత్ యెర్రమల్లి, ఎడిటర్ ఆదిత్య, డీవోపీలు హర్ష మల్లికార్జున,  దేవ్ దీప్,  క్రియేటివ్ ప్రొడ్యూసర్ వినయ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.