ఇప్పటి వరకు ఎమోషన్స్‌‌తో చేశా.. మైసా మూవీ కోసం నా లైఫ్‌‌నే ఇచ్చేశా: రష్మిక

ఇప్పటి వరకు ఎమోషన్స్‌‌తో చేశా.. మైసా మూవీ కోసం నా లైఫ్‌‌నే ఇచ్చేశా: రష్మిక

రష్మిక మందన్న ఫిమేల్ లీడ్‌‌గా నటిస్తున్న చిత్రం ‘మైసా’. రవీంద్ర పుల్లే దర్శకత్వంలో అన్‌‌ఫార్ములా ఫిల్మ్స్ బ్యానర్‌‌‌‌పై అజయ్ నిర్మిస్తున్నారు. ఆదివారం టీజర్‌‌‌‌ను రిలీజ్ చేశారు. ఇందులో  గోండ్ గిరిజన మహిళగా రష్మిక పోషించిన పాత్ర హైలైట్‌‌గా నిలిచింది. ఈ సందర్భంగా నిర్వహించిన ఈవెంట్‌‌లో రష్మిక మాట్లాడుతూ ‘ఇప్పటివరకు పెర్ఫార్మెన్స్ అంటే ఎమోషన్స్‌‌తో చేశా. ఇంత యాక్షన్ ఎప్పుడూ చేయలేదు.

‘ది గర్ల్‌‌ఫ్రెండ్’ సినిమాలో ఎమోషనల్‌‌గా ఏముంటుందో అంతా ఆ ఫిల్మ్‌‌లో ఇచ్చాను. ‘మైసా’ కోసం నా లైఫ్‌‌నే ఇచ్చేశాను. డైరెక్టర్ నాతో చాలా రిస్కీ స్టంట్స్ చేయించారు. కేరళలో దట్టమైన అడవుల్లో, కొండ ప్రాంతాల్లో, అండర్‌‌వాటర్ సీక్వెన్స్, మట్టి బురదలో యాక్షన్ సీక్వెన్స్ చేశా. చాలా హార్డ్ వర్క్ చేసిన ఈ సినిమా కచ్చితంగా అందరికీ నచ్చుతుంది’ అని చెప్పింది.  

గోండ్ గిరిజన బ్యాక్‌‌డ్రాప్‌‌లో ఈ చిత్రాన్ని రూపొందించామని, రష్మికను చాలా కొత్తగా చూస్తారని దర్శకుడు రవీంద్ర చెప్పాడు. ప్రొడ్యూసర్ అజయ్ మాట్లాడుతూ ‘రష్మిక గారు ఈ సినిమా కోసం ప్రాణాలు పెట్టి పని చేశారు. ఆడియన్స్‌‌కి గూస్‌‌బంప్స్ ఎక్స్‌‌పీరియన్స్ ఇచ్చేలా సినిమా ఉంటుంది’ అని అన్నారు. నవంబర్ 27న వరల్డ్‌‌వైడ్‌‌గా సినిమా విడుదల  కానుంది.