ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ షియోమీకి చెందిన సబ్ బ్రాండ్ రెడ్‌మి కొత్తగా కె100 సిరీస్‌ను చైనాలో త్వరలో లాంచ్ చేసేందుకు రెడీ అవుతుంది. అయితే లాంచ్ ముందే ఈ స్మార్ట్ ఫోన్ చాల ఫీచర్స్ బయటికి వచ్చాయి. సమాచారం ప్రకారం రెడ్‌మి కంపెనీ వచ్చే వారం ఆగస్టు 11న ఈ ఫోన్ ను విడుదల చేయనుంది.
రెడ్‌మీ K100 ప్రో లాంచ్‌కు ముందే దాని బ్యాటరీ, ఛార్జింగ్, కెమెరా స్పెసిఫికేషన్‌స్ బయటపడ్డాయి. ఈ ఫోన్ రెడ్‌మీ K100 ప్రో మ్యాక్స్‌తో పాటుగా లాంచ్ అవుతుందని.. దీనిలో 8,000mAh-క్లాస్ బ్యాటరీ, 200-మెగాపిక్సెల్ ప్రైమరీ రియర్ కెమెరా ఉంటాయని అంచనా.
రెడ్‌మి K100 ప్రో స్పెసిఫికేషన్లు
స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే K100 ప్రోలో 8,580mAh సిలికాన్-కార్బన్ బ్యాటరీ ఉంటుందని తెలుస్తుంది. అలాగే 100W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 50W వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుందని అంచనా. అంతేకాదు 27W వైర్డ్ రివర్స్ ఛార్జింగ్ సహా 22.5W వైర్‌లెస్ రివర్స్ ఛార్జింగ్‌కు కూడా సపోర్ట్ చేయవచ్చు.
కెమెరా స్పెసిఫికేషన్లు
ఫోటోగ్రఫీ కోసం, రెడ్‌మి K100 ప్రోలో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌తో 200-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుందని.. ఈ సెన్సార్ క్లియర్ ఫోటోలు తీయగలదని, ఇన్-సెన్సార్ క్రాపింగ్ ద్వారా లాస్‌లెస్ జూమ్‌ను అందిస్తుందని రెడ్‌మి పేర్కొంది. ప్రైమరీ కెమెరాతో పాటు అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరా, టెలిఫోటో కెమెరా లెన్స్ కూడా ఉంటాయి.
ALSO READ : ఇంజనీర్లకు క్రేజీ ఆఫర్: 2 నెలల ఇంటర్న్‌షిప్‌కు రూ.57 లక్షలు పేమెంట్!
ఇంతకుముందు రెడ్‌మి K100 ప్రోలో కొత్త M11 లూమినస్ మెటీరియల్‌తో కూడిన 6.59-అంగుళాల 1.5K ఫ్లాట్ OLED స్క్రీన్ ఉంటుందని తెలిపింది. ఈ డిస్‌ప్లే 4,500 నిట్స్ బ్రైట్నెస్, 185Hz రిఫ్రెష్ రేట్, 4,800Hz ఇన్‌స్టంట్ టచ్ శాంప్లింగ్ రేట్‌కు సపోర్ట్ ఇస్తుందని అంచనా.
ఈ ఫోన్ క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 వి-సిరీస్ చిప్‌సెట్‌తో పనిచేస్తుందని కూడా చెబుతున్నారు. ఇతర స్పెసిఫికేషన్లలో ఇన్-డిస్‌ప్లే 3D అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, LPDDR5X ర్యామ్, UFS 4.1 స్టోరేజ్, స్టీరియో స్పీకర్లు, వై-ఫై 7, బ్లూటూత్ 6.0, UWB కనెక్టివిటీ ఉన్నాయి.
