దమ్ముంటే రాజీనామా చేయండి.. నిమిషాల్లో ఆమోదిస్తా: తిరుగుబాటు ఎమ్మెల్యేలకు సీఎం డీకే రివర్స్ పంచ్

దమ్ముంటే రాజీనామా చేయండి.. నిమిషాల్లో ఆమోదిస్తా: తిరుగుబాటు ఎమ్మెల్యేలకు సీఎం డీకే రివర్స్ పంచ్

కర్నాటక రాజకీయాల్లో ఇంట్రస్టింగ్ టాపిక్. మంత్రి వర్గ విస్తరణ తర్వాత.. మంత్రి పదవులు రాలేదన్న కోపంతో రాజీనామా చేస్తామంటూ తిరుగుబాట చేశారు కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు. రాజీనామాలు ఇచ్చేస్తాం.. మేమే కాదు మరో 10 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయబోతున్నారంటూ 24 గంటలుగా ఒకటే హడావిడి.. ఇలాంటి ఎమ్మెల్యేలకు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చారు సీఎం డీకే శివకుమార్. 

బెదిరించటం కాదు.. భయపెట్టటం కాదు.. ముందు మీరు రాజీనామా చేయండి.. నిమిషాల్లో ఆమోదించేస్తా.. మీ రాజీనామా లేఖ పంపించమే ఆలస్యం.. నేను ఆమోదిస్తాను అంటూ తిరుగుబాటు ఎమ్మెల్యేలకు ఓపెన్ ఆఫర్ ఇచ్చారు సీఎం డీకే శివకుమార్.

మంత్రివర్గ విస్తరణలో చోటు దక్కలేదని ఎమ్మెల్యేలు యశ్వంతరాయగౌడ పాటిల్, బేళూరు గోపాల కృష్ణ రాజీనామా చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. సోమవారం (ఆగస్టు 03) జరిగిన విస్తరణలో చోటు దక్కలేదని.. మంగళవారం రాజీనామా చేస్తామని బెదిరింపులకు దిగారు. తమతో పాటు మరో పది మంది ఎమ్మెల్యేలు కూడా రాజీనామాలకు సిద్ధంగా ఉన్నట్లు హెచ్చరించారు. 

దీంతో అనూహ్య పరిణామాల తర్వాత సీఎంగా బాధ్యతలు చేపట్టిన డీకే శివకుమార్ కు మరో పెద్ద తలనొప్పిగా మారిందని అనుకున్నారు. కానీ.. ఇలాంటి ఎన్నో వివాదాలను చక్కదిద్దిన ఈ ట్రబుల్ షూటర్ కు ఇలాంటివి ఒక విషయమా అన్నట్లుగా.. ఊహించని రీతిలో రియాక్టయ్యారు డీకే. 

దమ్ముంటే మీరు రాజీనామాలు చేయండి. వెంటనే ఆమోదిస్తా. నిమిషాల్లో ఆమోదిస్తా. ఏ పర్లేదు అని రివర్స్ అటాక్ మొదలెట్టారు. ఒక వేళ పార్టీ ముఖ్యం, పార్టీలో భవిష్యత్తు ముఖ్యం అనుకుంటే ఉండండి.. లేదంటే రిజైన్ చేయండి.. నేను యాక్సెప్ట్ చేస్తా అంటూ వార్నింగ్ ఇచ్చారు. 

డీకే వార్నింగ్, పంచ్ తో తిరుగుబాటు ఎమ్మెల్యేలకు దిమ్మతిరిగినట్లుంది. అప్పటిదాకా రిజైన్ చేస్తానని బెదిరించిన ఎమ్మెల్యేలు.. డీకే వార్నింగ్ తో సైలెంట్ అయిపోయారు. రాజీనామా అనే మాట ఇప్పుడు అక్కడ వినిపించడం లేదు. ఎచ్చులకు పోతే ఉన్న ఎమ్మెల్యే పదవి కూడా పోయేటట్లుంది రా దేవుడా.. అన్నట్లుగా.. సైలెంట్ అయిపోయారు. 

సోమవారం జరిగిన కర్ణాటక మంత్రివర్గ విస్తరణ లో మొత్తం మినిస్టర్ల సంఖ్య 34 కు చేరుకుంది. విస్తరణలో 20 మందిని తీసుకోగా అందులో 12 మంది కొత్తవారికి అవకాశం కల్పించారు. కొత్త మంత్రులలో గాయత్రి శాంతెగౌడ్ ఒక్కరే మహిళ కావడం గమనార్హం.