ప్రైవేట్ పార్ట్స్ ను పట్టుకుని..అదే చేతులతో కూరగాయల అమ్మకం..వ్యాపారికి జైలుశిక్ష, జరిమానా

ప్రైవేట్ పార్ట్స్ ను పట్టుకుని..అదే చేతులతో కూరగాయల అమ్మకం..వ్యాపారికి  జైలుశిక్ష, జరిమానా

బషీర్​బాగ్, వెలుగు: అపరిశుభ్రంగా కూరగాయలు విక్రయిస్తున్న ఓ వ్యాపారికి జైలు శిక్ష పడింది. వివరాల్లోకెలితే.. నారాయణగూడ మేల్కొటి పార్క్ ఎదుట మహ్మద్​ వాసీక్​ అనే వ్యక్తి కూరగాయలు విక్రయిస్తుంటాడు. ఆయన తన ప్రైవేట్ భాగాలను చేతులతో రుద్దుకున్న అనంతరం, అదే చేతులతో కూరగాయలను ముట్టుకొని విక్రయించినట్లు ఆరోపణలు ఉన్నాయి. 

ఈ ఘటనను గమనించిన ఓ స్థానికుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది వైరల్‌‌గా మారింది. వీడియో ఆధారంగా నారాయణగూడ పోలీసులు కేసు నమోదు చేసి వాసీక్‌‌ను అరెస్ట్​ చేశారు. కేసును విచారించిన న్యాయస్థానం అతడికి 5 రోజుల జైలు శిక్షతో పాటు రూ.2,500 జరిమానా విధించినట్లు నారాయణగూడ ఇన్‌‌స్పెక్టర్ సైదేశ్వర్ తెలిపారు. ప్రజారోగ్యానికి భంగం కలిగించే ఇలాంటి చర్యలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.