న్యూఢిల్లీ: నిరసన ప్రదేశాలను మార్చినంత మాత్రాన ప్రజల గొంతును ఆపలేరని సినీ నటుడు ప్రకాశ్రాజ్ అన్నారు. దేశమంతా త్వరలోనే జంతర్ మంతర్లా మారుతుందని కేంద్రాన్ని హెచ్చరించారు. ఓటర్ల జాబితా సవరణపై సీఈసీ తీరును నిరసిస్తూ ఢిల్లీలో జరిగిన ఆందోళనలు, సీపీఐ నేతలు సౌరవ్ దాస్, అశుతోష్ రంకాల అరెస్టులపై బుధవారం ‘ఎక్స్’లో వీడియో విడుదల చేశారు.
దశాబ్దాలుగా నిరసనలకు వేదికైన జంతర్ మంతర్పై ఆంక్షలు విధించడాన్ని తప్పుబట్టారు. “మీరు ఎంత భయపడుతున్నారో ఈ చర్యలే చూపిస్తున్నాయి. చల్, దేఖేంగే” అని అన్నారు.
