అబిడ్స్, వెలుగు : తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచిన అలయ్ బలయ్ కార్యక్రమాన్ని ఈ నెల 22న నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో నిర్వహించనున్నట్లు హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, అలయ్ బలయ్ చైర్పర్సన్ బండారు విజయలక్ష్మి తెలిపారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ఏర్పాట్లపై సమీక్షా సమావేశం నిర్వహించారు.
అనంతరం వారు మాట్లాడుతూ అలయ్ బలయ్ కి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, సీఎంలు, రేవంత్రెడ్డి, చంద్రబాబు, హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ, గవర్నర్ శివప్రతాప్ శుక్లా, పంజాబ్ గవర్నర్ గులాబ్ చంద్ కటారియా, కేంద్ర మంత్రులు, ప్రముఖులు హాజరుకానున్నట్లు తెలిపారు.
