హైదరాబాద్, వెలుగు: అటవీ సంరక్షణ, వన్యప్రాణుల పర్యవేక్షణలో ఆధునిక సాంకేతికతను సమర్థవంతంగా వినియోగించుకోవాలని పీసీసీఎఫ్ వినయ్కుమార్ సూచించారు. దూలపల్లిలోని ఫారెస్ట్ అకాడమీ ఆధ్వర్యంలో వివిధ రాష్ట్రాలకు చెందిన 17 మంది ఐఎఫ్ఎస్ అధికారులకు అటవీ, వన్యప్రాణుల నిర్వహణలో సాంకేతికత వినియోగంపై 3 రోజుల శిక్షణ కార్యక్రమం బుధవారం ప్రారంభమైంది.
పీసీసీఎఫ్ వినయ్కుమార్ మాట్లాడుతూ.. డ్రోన్లు, జీపీఎస్ వంటివి క్షేత్రస్థాయి పరిశీలనకు ప్రత్యామ్నాయం కావని, టెక్నాలజీ ద్వారా సేకరించిన సమాచారాన్ని అధికారులు నేరుగా గ్రౌండ్ లెవల్లో సరిచూసుకోవాలని స్పష్టం చేశారు.
ఏపీ పీసీసీఎఫ్ పీవీ చలపతిరావు మాట్లాడుతూ.. అటవీ భూముల రికార్డులను ఆధునీకరించి డిజిటలీకరించడం ప్రస్తుత తరుణంలో అత్యంత ఆవశ్యకమని పేర్కొన్నారు. ఒడిశా పీసీసీఎఫ్ మురుగన్ మాట్లాడుతూ.. అందుబాటులో ఉన్న సాంకేతిక సమాచారాన్ని విశ్లేషించి సరైన నిర్ణయాలు తీసుకోవడంలో టెక్నాలజీ ఒక సాధనంగా మాత్రమే ఉపయోగపడుతుందని, మానవ నిర్ణయాలకు అది ప్రత్యామ్నాయం కాదన్నారు.
రోజుల పాటు జరిగే ఈ శిక్షణలో సర్వే ఆఫ్ ఇండియా, ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా నిపుణులతో క్షేత్రస్థాయి పర్యటనలు, డ్రోన్ల వినియోగంపై డెమోలు ఇవ్వనున్నారు.
