Mrunal Thakur: ది ఫ్యామిలీ స్టార్ లీక్స్.. ఆడియన్స్ను డిజప్పాయింట్ చేసిన మృణాల్

Mrunal Thakur: ది ఫ్యామిలీ స్టార్ లీక్స్.. ఆడియన్స్ను డిజప్పాయింట్ చేసిన మృణాల్

రౌడీ హీరో విజయ్ దేవరకొండ(Vijay Devarakonda), సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) జంటగా వస్తున్న లేటెస్ట్ మూవీ ది ఫ్యామిలీ స్టార్(The Family Star). దర్శకుడు పరశురామ్ పేట్ల(Parasuram petla) తెరకెక్కిస్తున్న ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీని దిల్ రాజు(Dil Raju) నిర్మిస్తున్నారు. సాంగ్స్, ట్రైలర్ తో మంచి హైప్ క్రియేట్ చేసిన ఈ సినిమా ఏప్రిల్ 5న థియేటర్స్ లోకి రానుంది. గీతగోవిందం వంటి బ్లాక్ బస్టర్ తరువాత విజయ్ దేవరకొండ, దర్శకుడు పరశురామ్ కాంబోలో వస్తున్న సినిమా కావడంతో ది ఫ్యామిలీ స్టార్ పై ప్రేక్షకుల్లో మంచి అంచాలున్నాయి. అందుకే ఈ సినిమా కోసం ఆడియన్స్ కూడా ఎదురుచూస్తున్నారు. 

Also Read: ప్రేమలు OTT డేట్ వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడో తెలుసా?

ఇదిలా ఉంటే.. త్వరలో రిలీజ్ కానున్న ఈ సినిమా ప్రమోషన్స్ ప్రస్తుతం షెరవేగంగా జరుగుతున్నాయి. చిత్ర యూనిట్ వరుసగా ఇంటర్వూస్ లో పాల్గొంటున్నారు. ఇందులో భాగంగా ఒక విషయంపై క్లారిటీ ఇచ్చి ఆడియన్స్ ను డిజప్పాయింట్ చేశారు మృణాల్. అదేంటంటే.. ది ఫ్యామిలీ స్టార్ మూవీ మృణాల్ కు తెలుగులో మూడవ సినిమా. మూడవ సినిమాకే తెలుగులో ఓన్ డబ్బింగ్ చెప్పారు మృణాల్ అనే వార్తలు వైరల్ అయ్యాయి. దీంతో తెలుగు ఆడియన్స్ ఫుల్లు హ్యాపీ ఫీలయ్యారు.

అయితే.. ఆవార్తల్లో ఏమాత్రం నిజం లేదని తాజాగా రివీల్ చేశారు మృణాల్. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ఈ సినిమా కోసం నేను సొంతగా డబ్బింగ్ చెప్పాలని ట్రై చేశాను. కానీ, రిలీజ్ డేట్ దగ్గర పడటం, ప్రమోషన్స్ పనులు మొదలవడంతో అది కుదరలేదు.. అంటూ చెప్పుకొచ్చింది మృణాల్. దీంతో ఆమె ఫ్యాన్స్ కాస్త డిజప్పాయింట్ అవుతున్నారు. ఈ సినిమాలో తన ఒరిజినల్ వాయిస్ వినొచ్చు అనుకున్న ఫ్యాన్స్ నిరుత్సాహపడుతున్నారు. కనీసం నెక్స్ట్ సినిమాలోనైనా మృణాల్ సొంతగా డబ్బింగ్ చెప్పుకుంటారు అనేది చూడాలి.