Premalu OTT Official: ప్రేమలు OTT డేట్ వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడో తెలుసా?

Premalu OTT Official: ప్రేమలు OTT డేట్ వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడో తెలుసా?

రీసెంట్ మలయాళ సూపర్ హిట్ మూవీ ప్రేమలు(Premalu). దర్శకుడు గిరీష్ ఏడీ(Girish AD) తెరకెక్కించిన ఈ యూత్ఫుల్ ఎంటర్టైనర్ లో నస్లీన్(Naslen), మమిత బైజు(Mamitha Baiju) జంటగా నటించారు. టీజర్, ట్రైలర్ తో మంచి అంచనాలు క్రియేట్ చేసిన ఈ మూవీ ఫిబ్రవరి 9న విడుదలై భారీ విజయాన్ని సాధించింది. కామెడీ అండ్ లవ్ ఎంటర్టైనగా వచ్చిన ఈ సినిమాకు ఆడియన్స్ ఫిదా అయ్యారు. దీంతో బాక్సాఫీస్ దగ్గర అదిరిపోయే కలెక్షన్స్ రాబట్టింది. అసలు ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా ఏకంగా రూ.130 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. 

దీంతో.. మలయాళంలో ఈ సినిమాకు వచ్చిన క్రేజ్ ను దృష్టిలో పెట్టుకొని తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు మేకర్స్. తెలుగులో ఈ సినిమాను దర్శకుడు రాజమౌళి కుమారుడు కార్తికేయ రిలీజ్ చేయడంతో ఇక్కడ కూడా మంచి బజ్ క్రియేట్ అయ్యింది. కలెక్షన్స్ కూడా అదే రేంజ్ లో వచ్చాయి. మార్చి 8న తెలుగులో వచ్చిన ఈ సినిమా ఇప్పటివరకు రూ.17 కోట్లు రాబట్టి తెలుగులో హైయెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన మళయాళ సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది ప్రేమలు.

ఇక ఈ సినిమా విడుదలై రెండు నెలలు గడుస్తున్న క్రమంలో ప్రేమలు ఓటీటీ రిలీజ్ పై రోజుకో న్యూస్ వైరల్ అవుతోంది. దీంతో.. తాజాగా ప్రేమలు ఓటీటీ రిలీజ్ పై అధికారిక ప్రకటన ఇచ్చారు మేకర్స్. ఈ సినిమాను ప్రముఖ ఓటీటీ సంస్థ హాట్‌స్టార్‌లో ఏప్రిల్ 12 నుండి స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించారు. దీంతో.. ప్రేమలు సినిమా ఓటీటీ రిలీజ్ కోసం చూస్తున్న ఆడియన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. మరి థియేటర్స్ లో రికార్డ్స్ క్రియేట్ చేసిన ఈ సినిమాకు ఓటీటీలో ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి.