Spirit: ప్రభాస్ స్పిరిట్లో మహానటి.. భయపెడుతున్న ప్లాప్ సెంటిమెంట్!

Spirit: ప్రభాస్ స్పిరిట్లో మహానటి.. భయపెడుతున్న ప్లాప్ సెంటిమెంట్!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) ప్రస్తుతం వరుసగా క్రేజీ ప్రెజెక్ట్స్ చేస్తున్నారు. వాటిలో సలార్ పార్ట్ 2(Salaar 2), కల్కి 2898 ఏడీ(Kalki 2898 AD), స్పిరిట్(Spirit) సినిమాలు ఉన్నాయి. అయితే.. ఈ మూడు సినిమాల్లో స్పిరిట్ కోసమే ఆయన ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. కారణం ఈ సినిమాకు సందీప్ రెడ్డి వంగ(Sandeep reddy vanga) దర్శకుడు అవడం. ఆయన రీసెంట్ మూవీ యానిమల్ మూవీ ఎంత భారీ విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందుకే.. స్పిరిట్ సినిమాపై అంచనాలు నెక్స్ట్ లెవల్ కు చేరుకుంటున్నాయి. ఇక సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్ లో ప్రభాస్ పర్ఫార్మెన్స్ పీక్స్ లో ఉంటుందని, ఆయన యాటిట్యూడ్ కి రెబల్ స్టార్ హీరోయిజం తోడైతే ఇండియన్ సినిమా రికార్డ్స్ బ్రేక్ అవడం ఖాయమని డిసైడ్ అవుతున్నారు. 

అయితే అన్నీ బాగానే ఉన్నాయి కానీ, లేటెస్ట్ గా వైరల్ అవుతున్న ఒక్క విషయం మాత్రం ప్రభాస్ ఫ్యాన్స్ ను కలవరపెడుతోంది. అదేంటంటే.. ప్రభాస్ పోలీసుగా కనిపిస్తున్న ఈ సినిమాలో ఆయనకు జోడీగా మహానటి కీర్తి సురేష్ ను తీసుకున్తున్నారట మేకర్స్. ఈ విషయంలోనే ప్రభాస్ ఫ్యాన్స్ కాస్త డిజప్పాయింట్ అవుతున్నారు. కారణం.. మహానటి తరువాత కీర్తి సురేష్ హీరోయిన్ గా వచ్చిన ఒక్క సినిమా కూడా హిట్ అవలేదు. మహేష్ బాబుతో చేసిన సర్కారువారి పాత మినహాయిస్తే.. యావరేజ్ హిట్ గా నిలిచిన సినిమా కూడా లేకపోవడం గమనార్హం.

అందుకే హీరోయిన్ విషయంలో ప్రభాస్ ఫ్యాన్స్ ఫీలవుతున్నారట. అసలే స్పిరిట్ సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నాం. ఒక వేళా కీర్తి ప్లాప్ సెంటిమెంట్ వర్కౌట్ అయ్యి ఏదైనా తేడా కొడితే కష్టం అన్నా అంటూ రిక్వెస్ట్ చేస్తున్నారు ఫ్యాన్స్. మరి ప్రభాస్ ఫ్యాన్స్ రిక్వెస్ట్ ను స్పిరిట్ మేకర్స్ కన్సీడర్ చేస్తారా లేదా అనేది చూడాలి. ఇక ప్రభాస్ నుండి వస్తున్న నెక్స్ట్ సినిమా కల్కి 2898 ఏడీ విషయానికి వస్తే.. ఈ సినిమా  మే 9న థియేటర్స్ లోకి రానుంది.