బిగ్ సర్‌ప్రైజ్కు ప్లాన్ చేసిన శృతి హాసన్.. అంతలోనే ?

బిగ్ సర్‌ప్రైజ్కు ప్లాన్ చేసిన శృతి హాసన్.. అంతలోనే ?

‘సలార్’(Salaar) వంటి ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్ తో కోల కళ్ల చిన్నది శృతి హాసన్(Shruti Haasan) త్వరలో సందడి చేయనుంది. ఇటీవల ఈ బ్యూటీ ఫ్యాన్స్ ఓ గుడ్ న్యూస్ తో పాటు మరో బ్యాడ్ న్యూస్ ని కూడా వినిపించింది. కొంతకాలంగా విపరీతమైన జ్వరంతో బాధపడుతున్నట్టు శృతి తెలిపింది.

మొదట డెంగ్యూ లక్షణాలుగా భావించానని తీరా చూస్తే తనకు సోకింది వైరల్ ఫీవర్ అని తెలిపింది. హెల్త్ ను సరిగ్గా పట్టించుకోకపోవడంతో ఈ జ్వరం తనను నేలకు అంటుకుపోయేంత బలహీనంగా మార్చేసిందని తెలిపింది. ప్రస్తుతం తాను కోలుకున్నానని..తనకు వైద్యం అందించిన వైద్యులకు థాంక్స్ చెప్పింది.

Also Read :-గర్ల్ ఫ్రెండ్గా రష్మిక మందన్న

ఇక ఈ నెల 26న శృతి ఓ సప్రైజ్ అనౌన్స్మెంట్ చేయనున్నట్టు ఇటీవల తెలిపింది. ఇది ఏమయ్యుంటుందా అని ఫ్యాన్స్ లో ఆసక్తి నెలకొంది. లైఫ్ అప్డేటా లేక కొత్త సినిమా ప్రకటన లేదా కొత్తగా వ్యాపార రంగంలోకి దిగుతుందా అని తెలియాల్సి ఉంది. 

శ్రుతి హాసన్ ఈ ఏడాది ప్రారంభంలో వీర సింహా రెడ్డి, వాల్తేరు వీరయ్య వంటి సినిమాలతో హిట్టు కొట్టేసింది. ఈ మూవీస్ హిట్టైనా కూడా ఆమెకు తెలుగులో అవకాశాలు మాత్రం రావడం లేదు. మరి ప్రభాస్ సలార్ అయినా ఆమె భవిష్యత్తును మారుస్తుందో లేదో చూడాలి.