గర్ల్ ఫ్రెండ్గా రష్మిక మందన్న.. బంపర్ ఆఫర్ కొట్టేసిన రాహుల్ రవీంద్రన్

గర్ల్ ఫ్రెండ్గా రష్మిక మందన్న..  బంపర్ ఆఫర్ కొట్టేసిన రాహుల్ రవీంద్రన్

అందాల రాక్షసి, చిలసౌ వంటి మూవీస్ తో గుర్తింపు పొందిన డైరెక్టర్ రాహుల్​ రవీంద్రన్ (Rahul Ravindran). చి.ల.సౌ మూవీకి గాను బెస్ట్ ఒరిజినల్ స్కీన్ ప్లే అందించినందుకు రాహుల్ రవీంద్రన్ కు జాతీయ అవార్డు కూడా వరించింది. మరోసారి రాహుల్ తన లేటెస్ట్ మూవీను ప్రకటించారు. ఈ మూవీలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న ( Rashmika Mandanna) కీ రోల్ లో నటించనుందని మేకర్స్ టైటిల్ వీడియో రిలీజ్ చేశారు.

ఈ వీడియోలో వచ్చే మాటలు ఆకట్టుకుంటున్నాయి..'నేను తనని ఎంత ప్రేమిస్తున్నాను అంటే..తనకి ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ ఎవ్వరు అక్కర్లేదురా..నేను ఒక్కడినే చాలు..24 గంటలు ఆ పిల్ల నాతోనే ఉండాలనిపిస్తుంది..నాది అని చెప్పుకోవడానికి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంటే..ఆ కిక్కే వేరురా..అంటూ..ది గర్ల్ ఫ్రెండ్ ( The Girlfriend) టైటిల్ ను కన్ఫర్మ్ చేసిన విధానం బాగుంది.

ALSO READ :కేసీఆర్, కేటీఆర్, హరీశ్రావుపై పోటీ చేసే బీజేపీ అభ్యర్థులు ఎవరంటే.?

హీరోయిన్ రష్మిక నీళ్లలో నుంచి ఫస్ట్ లుక్ రివీల్ చేయగా..తన మెస్మరైజింగ్ స్మైల్ తో ఫిదా చేస్తుంది. ఈ మూవీకి స్టోరీ,స్క్రీన్ ప్లే, డైలాగ్స్, డైరెక్షన్ రాహుల్ రవీంద్రన్ కావడం విశేషం. దీంతో రష్మిక మందన్న ట్వీట్ చేస్తూ..ప్రపంచం గొప్ప ప్రేమకథలతో నిండి ఉంది. అయితే ఇప్పటివరకు వినని, చూడని ప్రేమకథలు కూడా కొన్ని ఉన్నాయి. అందులో ది గర్ల్ ఫ్రెండ్ ఒకటి అంటూ..ట్వీట్ చేసింది.

రష్మిక మందన్న సినిమాల విషయానికి వస్తే..రణబీర్ కపూర్ యానిమల్, 'రెయిన్‌బో, ధనుష్ D51, ఛావా, అల్లు అర్జున్ పుష్ప: ది రూల్ అలాగే రవితేజతో ఓ మూవీ చేయనుంది. 

ది గర్ల్ ఫ్రెండ్ మూవీ రష్మికకు 24వ చిత్రం కాగా..గీతా ఆర్ట్స్51వ చిత్రంగా తెరకెక్కనుంది. ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. అల్లు అరవింద్ సమర్పణలో మాస్ మూవీ మేకర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్‌మెంట్ పతాకాలపై విద్యా కొప్పినీడి, ధీరజ్ మొగిలినేని ఈ చిత్రాన్ని నిర్మించారు. మ్యూజిక్ సెన్సేషన్ హేశమ్ అబ్దుల్ వాహబ్ సంగీతం అందిస్తున్నారు.

ప్రస్తుతం టాలీవుడ్ లో వరుస సినిమాలకు హేశం అబ్దుల్ అద్భుతమైన సాంగ్స్ ఇస్తున్నారు. రీసెంట్ గా ఖుషితో ఆల్బం హిట్ అందుకున్నారు. ఇప్పటికే నాని హాయ్ నాన్న నుంచి సాంగ్స్ ఆడియన్స్ ను వీపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. కాగా, త్వరలో శర్వానంద్ మూవీకి సంగీతం అందిస్తున్నారు.