కేసీఆర్, కేటీఆర్, హరీశ్రావుపై పోటీ చేసే బీజేపీ అభ్యర్థులు ఎవరంటే.?

కేసీఆర్, కేటీఆర్, హరీశ్రావుపై  పోటీ చేసే బీజేపీ అభ్యర్థులు ఎవరంటే.?

బీజేపీ  52 మందితో అసెంబ్లీ అభ్యర్థుల తొలి జాబితాను రిలీజ్ చేసింది. ఇప్పటికే 115 మందితో   బీఆర్ఎస్ ఫస్ట్ లిస్టు, 55 మందితో కాంగ్రెస్ తొలి జాబితాను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్ రావు, కేటీఆర్ ల నియోజకవర్గాలపై అందరి దృష్టి పడింది.     ప్రతిపక్షాల నుంచి ఎవరు బరిలోకి దిగుతున్నారు.. పోటీ ఎలా ఉండబోతుందనేది ఆసక్తికరంగా మారింది. 

సీఎం కేసీఆర్ ఈ  ఎన్నికల్లో  కామారెడ్డి, గజ్వేల్  రెండు చోట్ల  నుంచి పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే..కామారెడ్డిలో బీజేపీ నుంచి  వెంకట రమణా రెడ్డి బరిలో నిలుస్తుండగా కాంగ్రెస్ ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు. షబ్బీర్ అలీ పోటీ చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక మరో నియోజకవర్గం గజ్వేల్ లో కేసీఆర్ పై బీజేపీ నుంచి  ఈటల రాజేందర్ పోటీ చేస్తుండగా..కాంగ్రెస్ నుంచి  తూంకుంట నర్సారెడ్డి బరిలోకి దిగుతున్నారు. ఇప్పటి వరకు గజ్వేల్ లో ద్విముఖ పోరు ఉండగా..ఈ ఎన్నికల్లో త్రిముఖ పోరు ఉండేలా కనిపిస్తోంది.

 బీఆర్ఎస్ లో మరో కీలక నేత హరీశ్ రావు  సిద్దిపేట నుంచి బరిలోకి దిగుతున్న సంగతి తెలిసిందే. హరీశ్ రావుపై  ప్రత్యర్థి పార్టీలు ఇంకా అభ్యర్థులను ప్రకటించలేదు. సిరిసిల్ల నుంచి మంత్రి కేటీఆర్  పోటీ చేస్తుండగా ఆయనకు ప్రత్యర్థులుగా బీజేపీ నుంచి రాణి రుద్రమ రెడ్డి బరిలోకి దిగుతుండగా.. కాంగ్రెస్ ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు