యుద్ధం అమెరికా, ఇజ్రాయెల్తో అయితే.. ఇరాన్ గల్ఫ్ను ఎందుకు టార్గెట్ చేస్తుందంటే..

యుద్ధం అమెరికా, ఇజ్రాయెల్తో అయితే.. ఇరాన్ గల్ఫ్ను ఎందుకు టార్గెట్ చేస్తుందంటే..

యుద్ధం అమెరికా, ఇజ్రాయెల్తో అయితే ఇరాన్ గల్ఫ్ను ఎందుకు టార్గెట్ చేస్తుందనే అంశం సోషల్ మీడియాలో చర్చనీయాంశం అయింది. అమెరికా సైనిక స్థావరాలకు ఆశ్రయం ఇస్తున్న గల్ఫ్ దేశాలపై ఇరాన్ మిస్సైల్ దాడులు, డ్రోన్ దాడులు చేస్తుండటంతో గల్ఫ్ దేశాల ప్రజలు భయంతో వణికిపోతున్నారు.

ఇరాన్ ఈ వ్యూహం ఎంచుకోవడం వెనుక పెద్ద కారణమే ఉందని ప్రపంచ దేశాలు భావిస్తున్నాయి. యుద్ధం ఖర్చును పెంచడంతో పాటు అమెరికాపై గల్ఫ్ దేశాల నుంచి ఒత్తిడి తీసుకురావడమే ఇరాన్ లక్ష్యంగా కనిపిస్తుంది. ప్రపంచ చమురు మార్కెట్లను కుదేలు చేస్తే పరిస్థితి తమకు అనుకూలంగా మారుతుందని.. ఇజ్రాయెల్, అమెరికా దేశాలపై ఒత్తిడి పెరుగుతుందని ఇరాన్ భావిస్తుంది. అందుకే.. ఇజ్రాయెల్‌ సహా అమెరికా మిత్ర దేశాలపై ఇరాన్‌ మిస్సైల్స్తో విరుచుకుపడుతుంది.

కువైట్‌లోని అమెరికా ఎంబసీ లక్ష్యంగా ఇరాన్ మిస్సైల్ ప్రయోగించడం గమనార్హం. కువైట్‌లో మినా అల్ అహ్మది చమురు శుద్ధి కర్మాగారంపై దాడి చేసింది. దోహా, అబుదాబిలో పేలుళ్లు సంభవించాయి. బహ్రెయిన్‌లోని యూఎస్‌ బేస్‌ను కూడా ఇరాన్ క్షిపణి దెబ్బ తీసింది. బహ్రెయిన్, అబుదాబి, దుబాయ్, షార్జా, ఖతార్, కువైట్కు ఇరాన్ మిస్సైల్స్ కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి.

ఫిబ్రవరి 28న ఇరాన్ సుప్రీం లీడర్‌ను అమెరికా-ఇజ్రాయెల్ చంపేశాక.. గల్ఫ్ దేశాలపై మిస్సైల్స్ దాడిని ఇరాన్ మరింత తీవ్రతరం చేసింది. టెహ్రాన్ వందలాది క్షిపణులను, డ్రోన్‌లను గల్ఫ్ దేశాల మీదకు పంపింది. సౌదీ అరాంకో రిఫైనరీపై కూడా ఇరాన్ దాడులు చేసి చమురు సంక్షోభానికి తెరలేపింది. ఇలా.. గల్ఫ్ దేశాలను టార్గెట్ చేయడం ద్వారా అమెరికా, ఇజ్రాయెల్ దేశాలను పరోక్షంగా దెబ్బ కొట్టొచ్చని ఇరాన్ భావిస్తుండటం గమనార్హం.