యుద్ధం వేళ భారీగా తగ్గిన గోల్డ్.. కేజీకి రూ.35వేలు పెరిగిన వెండి.. హైదరాబాద్ రేట్లివే..

యుద్ధం వేళ భారీగా తగ్గిన గోల్డ్.. కేజీకి రూ.35వేలు పెరిగిన వెండి.. హైదరాబాద్ రేట్లివే..

ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం వేళ విలువైన లోహాలు అనూహ్యంగా స్పందిస్తున్నాయి. ఈ క్రమంలో అందరినీ ఆశ్చర్య పరుస్తున్న విషయం గోల్డ్ రేట్ల పతనమే. వాస్తవానికి రేట్లు భారీగా పెరుగుతాయ్ అని కొనుగోలుదారులు బయటపడుతున్న వేళ తగ్గుదల ఊరటను కలిగిస్తోంది. ఇదే క్రమంలో వెండి మాత్రం దూసుకుపోతోంది. షాపింగ్ చేయాలని అనుకుంటున్న వ్యక్తులు ముందుగా తమ ప్రాంతంలో తగ్గిన రిటైల్ రేట్లను గమనించటం మంచిది. 

మార్చి 2న బంగారం రేట్లు భారీగా తగ్గి ఊరటను కలిగిస్తున్నాయి. దీంతో మార్చి 1 కంటే గ్రాముకు 24 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.329 తగ్గింది. దీంతో హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడప నగరాల్లో స్వచ్చమైన బంగారం రేటు రూ.16వేల 980గా కొనసాగుతోంది. ఈ నగరాల్లో 22 క్యారెట్ల బంగారం రేటు గ్రాముకు రూ.15వేల 565గా తెలుగు రాష్ట్రాల్లోని నగరాల్లో కొనసాగుతోంది. 

ఇక వెండి విషయానికి వస్తే  మార్చి 2, 2026న రేటు కేజీకి రూ.35వేలు పెరిగింది దేశవ్యాప్తంగా. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాలైన హైదరాబాద్, వరంగల్, నిజాంబాద్, ఖమ్మం, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కడపలో కేజీ స్వచ్ఛమైన వెండి రేటు రూ.3లక్షల 15వేలకు చేరుకుంది. అంటే గ్రాము ధర రూ.315 వద్ద ఉంది.