అమెరికా-ఇరాన్ యుద్ధం ప్రభావం ప్రపంచ దేశాలపై పడే సమయం ఆసన్నమైంది. అత్యధికంగా ఆయిల్, గ్యాస్ సరఫరా జరిగే మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తల కారణంగా.. జేబులకు చిల్లు పడే రోజులొచ్చాయి. ప్రొడక్షన్ తగ్గి సరఫరా అంతరాయం కలగటమే ఇందుకు కారణం. ఇంధనం కొరతతో ఇప్పుడున్న రేట్లు ఎంతకు పెరుగాయో.. పెరిగితే వాటినికి సంస్థలు భరిస్తాయా.. లేక కస్టమర్లపైనే భారం వేస్తాయా అనేది కూడా పరిగణించాల్సిన అంశం. ఒకవేళ కస్టమర్లపేనే భారం వేస్తే పరిస్థితేంటో ఓసారి చూద్దాం.
ఇండియన్ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు.. రష్యాతో 12 నుంచి 14 డాలర్లకే బ్యారెల్ కొన్నసమయంలో లాభాన్ని కస్టమర్లకు పాస్ ఆన్ చేయకుండా వాటి జేబులోనే వేసుకున్నాయి. మరి నష్టాలు వచ్చినప్పుడు కూడా అవే భరిస్తాయా.. ప్రజలపై భారం మోపుతాయా అనేది ఇక్కడ కీలకమైన అంశం.
క్రూడ్ ఆయిల్ ధరలు
మిడిల్ ఈస్ట్ నుంచి ఆయిల్ రవాణా జరిగే హార్మూజ్ జలసంధిని మూసి వేసిన తర్వాత ఇరాన్ గస్తీ దళాల (IRGC) VHF రేడియో లో హెచ్చరికలు జారీ చేశాయి. దీంతో జలసంధి నుంచి రవాణా ఆగిపోవడంతో క్రూడ్ ఆయిల్ ధరలు పెరగిపోయాయి. ఆ తర్వాత సోమవారం (మార్చి 02) మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత.. క్రూడ్ ధరలు ఒక్కసారిగా 10 శాతం పెరిగి.. బ్యారల్ 82 డాలర్లకు చేరుకున్నాయి. 8 నెలల్లో ఇదే అధికం. అదే విధంగా న్యాచురల్ గ్యాస్ ధరలు 25 శాతం పెరిగాయి. ప్రపంచ ఆయిల్ డిమాండ్ లో హార్మూజ్ జలసంధి నుంచే ఎక్కువ జరుగుతుంటుంది.
►ALSO READ | యుద్ధంతో దలాల్ స్ట్రీట్ రక్తపాతం.. ఒక్కరోజే రూ.10 లక్షల కోట్లు నష్టపోయిన దేశీయ ఇన్వెస్టర్లు
యుద్ధం కారణంగా పెరుగుతున్న చమురు ధరలతో ఇండియా మళ్లీ వైపు చూస్తోంది. రెండేళ్లపాటు బ్యారెల్‌కు దాదాపు $15 తగ్గింపుతో రష్యన్ చమురును కొనుగోలు చేసిన తర్వాత, అమెరికా ఒత్తిడితో మన రిఫైనరీలు తీవ్రంగా తగ్గించుకోవలసి వచ్చింది. జనవరి 2026లో1.1 మిలియన్ బ్యారెళ్ల రష్యన్ ముడి చమురును దిగుమతి చేసుకుంది. నవంబర్ 2022 తర్వాత దానితో పోల్చితే ఇది చాలా తక్కు. మొత్తం క్రూడ్ దిగుమతుల్లో రష్యా నుంచి వాటా 21.2%కి తగ్గింది, అక్టోబర్ 2022 తర్వాత ఇదే అత్యల్ప దిగుమతి. అమెరికా ఒత్తిడితో జనవరిలో ఇండియా మొత్తం దిగుమతుల్లో మిడిల్ ఈస్టర్న్ నుంచి పెంచుకుంది. అక్కణ్నుంచి దిగుమతి అయ్యే వాటా దాదాపు 55% శాతానికి చేరుకుంది. ప్రస్తుత సంక్షోభ పరిస్తుల్లో మళ్లీ రష్యావైపు ఇండియా చూస్తోంది.
ఆర్థిక వ్యవస్థపై ప్రభావం
2026 పైనాన్షియల్ ఇయర్ ఫస్ట్ క్వార్టర్ లో (ఏప్రిల్-సెప్టెంబర్ 2025) ఇండియా ఆయిల్ దిగుమతి బిల్లు గత సంవత్సరంతో పోలిస్తే 14.7% తగ్గింది. అంటే 71.2 బిలియన డాలర్ల నుంచి 60.7 బిలియన్ డాలర్లకు చేరుకుంది. 2026 ఆర్థిక సంవత్సరం మొదటి ఎనిమిది నెలల్లో మొత్తం దిగుమతులు 2.4% పెరిగి 163.4 మిలియన్ బ్యారెళ్లకు చేరుకున్నప్పటికీ, రష్యన్ చమురు తక్కువ ధరకు లభించడం కారణంగా బిల్లు తగ్గింది. ప్రస్తుతం క్రూడ్ ప్రైసెస్ మళ్లీ పెరిగే అవకాశం ఉండటంతో ఆయిల్ బిల్లు ఖచ్చితంగా పెరిగే అవకాశముంది. క్రూడ్ ఈ స్థాయిలో పెరిగితే ఇండియా బిల్లు కనీసం 11 వరకు అదనంగా పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. యుద్ధం ఎక్కువ కాలం కొనసాగితే, ముడి చమురు ధరలు బ్యారెల్‌కు 100 డాలర్ల లిమిట్ దాటవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. అలాంటప్పుడు, ఇండియా ఆయిల్ బిల్లు దాదాపు 30 బిలియన్ డాలర్లు పెరగవచ్చునని అంటున్నారు.
కస్టమర్లపై భారం:
క్రూడ్ ఆయిల్ ధర ప్రతి ఒక డాలర్ర పెరిగితే ఇండియాలో లీటరు పెట్రోల్, డీజిల్ ధరలకు 50 పైసల నుండి 60 పైసల వరకు ఖర్చవుతుంది. అంతర్జాతీయంగా క్రూడ్ ధరలు 100 డాలర్లకు పెరిగితే పెట్రోల్ లీటరుకు రూ.10 నుండి రూ.15 వరకు, డీజిల్ లీటరుకు రూ.10 నుండి రూ.12 వరకు పెరగే అవకాశం ఉంది. బ్యారెల్‌కు 110 డాలర్లు పెరిగి తగ్గకుండా కొన్నాళ్లు అదే స్థాయిలో ఉంటే, పెట్రోల్ ధరలు రూ.25 వరకు పెరగవచ్చు. ఇక పెట్రోలియం గ్యాస్ (LPG) ధరలు సిలిండర్‌కు రూ.50 నుండి రూ.150 వరకు పెరగవచ్చునని చెబుతున్నారు.
